English | Telugu

పహల్ గామ్ ఘటనకి స్టార్ సింగర్ భాషకి సంబంధం ఏంటి? కేసులు నమోదు!

భారతీయ సినీ పాటల చరిత్రలో బాలీవుడ్ గాయకుడు 'సోనునిగమ్'(Sonu NIgam)కి ప్రత్యేక స్థానం ఉంది. 1993లో వచ్చిన 'ఆజా మేరీ జాన్' చిత్రంలోని 'ఓ ఆస్మాన్ వాలే' సాంగ్ ఆయన మొదటి పాట. ఆ తర్వాత హిందీతో పాటు బెంగాలీ, కన్నడ, తెలుగు, తమిళం, మరాఠీ, ఒరియా, గుజరాతీ, అస్సామీ, తుళు, మైథిలీ, నేపాలీ లాంటి పలు భాషల్లో పాడి ఎంతో మంది అభిమానులని పొందాడు. ఇప్పటి వరకు సుమారు ఆరువేల పాటలు వరకు పాడిన సోను నిగమ్ నాలుగు దశాబ్దాల నుంచి లైవ్ కన్సర్ట్ లో పాల్గొంటు అభిమానులని అలరిస్తు వస్తున్నాడు.

ఈ క్రమంలోనే రీసెంట్ గా బెంగుళూరు(Bengaluru)లో జరిగిన మ్యూజిక్ కన్సర్ట్ లో పాల్గొన్నాడు. వేరే లాంగ్వేజ్ కి సంబంధించిన పాట పాడుతుంటే, కన్నడం(kannadam)లోనే పాడాలని ఒక యువకుడు పదే పదే డిమాండ్ చేసాడు. దీంతో సహనం కోల్పోయిన సోను నిగమ్ వాదన చేస్తున్న వ్యక్తితో నాకు కూడా భాషపై అభిమానం ఉంది. కన్నడ భాషని గౌరవిస్తాను. కానీ బెదిరిస్తున్నట్టుగా మాట్లాడితే బాధ వేస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేసారో అలాంటి కారణంగానే 'పహల్ గామ్' దాడి జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి కారణంగానే జరిగింది డిమాండ్ చేసే ముందు కనీసం మీ ముందు ఎవరున్నారో చూడండి.

నేను అన్ని భాషల్లో పాటలు పాడినా కూడా, కన్నడ భాషలోనే ఎక్కువ మంచి పాటలు పాడాను. బెంగుళూర్ వచ్చిన ప్రతిసారి ఎంతగానో ప్రేమిస్తు ఒక కుటుంబ సభ్యుడులాగా ఆదరిస్తారు. కానీ ఆ యువకుడు బెదిరించినట్టుగా మాట్లాడటం నచ్చలేదు. ఆ యువకుడు పుట్టకముందే నుంచే కన్నడంలో పాటలు పాడుతున్నానని సోను నిగమ్ చెప్పుకొచ్చాడు. ఇక భాషని ఉద్దేశించి సోను నిగమ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసాడని కన్నడ నాట కొంత మంది ఆయనపై కేసు నమోదు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. సోను నిగమ్ స్వస్థలం హర్యానాలోని ఫరీదాబాద్.


Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.