English | Telugu
నువ్వు సింహానివి..తమిళ హీరో పాటపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Updated : May 2, 2025
సిల్వర్ స్క్రీన్ పై స్టార్ క్రికెటర్ 'విరాట్ కోహ్లీ'(Virat Kohli)బయోపిక్(Biopic)తెరకెక్కనుందనే వార్తలు ఎప్పట్నుంచో వస్తూనే ఉన్నాయి. ఇందుకు సంబంధించి హిందీ వెర్షన్ లో రణబీర్ కపూర్ చేస్తాడని, తెలుగులో అఖిల్ అక్కినేని, తమిళంలో శింబు చేస్తారనే రూమర్స్ కూడా సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఆయా నటులు కూడా చాలా సందర్భాల్లో కోహ్లీ బయోపిక్ లో నటించాలని ఉందని కూడా చెప్పారు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే కోహ్లీ ప్రస్తుతం 'ఐపిఎల్'(Ipl)తరుపున 'బెంగుళురు'(Bengalore)కి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా కోహ్లీ రీసెంట్ గా ఒక నేషనల్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.
అందులో ఆయన మాట్లాడుతు నాకు నచ్చే సాంగ్ పేరు చెబితే మీరంతా షాక్ అవుతారు. 'పాతు తాలా'(Paathu Thala)మూవీలోని 'నీ సింగం దాన్'(Nee Singam Dhan)అనే సాంగ్ అంటే నాకు ఎంతో ఇష్టమని చెప్పాడు. ఈ సాంగ్ కి కోహ్లీ ఆన్ ది ఫీల్డ్ లో స్మైల్ గా ఉన్న వీడియోని ఎడిట్ చేసి ఆర్ సి బి యాజమాన్యం సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసింది. దీంతో సదరు వీడియో రికార్డు వ్యూస్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆ వీడియోని రీపోస్ట్ చేసిన శింబు 'నువ్వు సింహానివి' అనే క్యాప్షన్ పెట్టాడు.
పాతు తాలా మూవీ 2023 మార్చి 30 న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకోగా, ఏ ఆర్ రెహ్మాన్(Ar Rehman)సంగీత సారధ్యంలోనీ సింగం దాన్ పాట తెరకెక్కింది. బాలనటుడిగా తమిళ చిత్ర సీమలోకి ఎంట్రీ ఇచ్చిన శింబు ఆ పై హీరోగా ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాల్లో నటించి అశేష అభిమానులని సంపాదించాడు. తెలుగులో కూడా ఆయన నటించిన మన్మధ, వల్లభ లాంటి చిత్రాలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం విశ్వ కథానాయకుడు 'కమల్ హాసన్'(Kamal Haasan)తో కలిసి 'థగ్ లైఫ్'(Thug Life)మూవీలో చేస్తున్నాడు. మణిరత్నం(Maniratnam)దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై పాన్ ఇండియా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. జూన్ 5 న థియేటర్స్ లోకి అడుగుపెట్టనుంది.
