English | Telugu
మరోసారి.. మెగాస్టార్ వర్సెస్ నటసింహం!
Updated : May 29, 2022
మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణకి బాక్సాఫీస్ క్లాష్ కొత్తేమీ కాదు. ఇప్పటికే ఈ ఇద్దరు పలుమార్లు బాక్సాఫీస్ బరిలో పోటీపడ్డారు. చివరిసారిగా 2017 సంక్రాంతి సీజన్ లో చిరంజీవి తన 150వ చిత్రం `ఖైదీ నంబర్ 150`తో సందడి చేస్తే.. బాలయ్య తన 100వ సినిమా `గౌతమీపుత్ర శాతకర్ణి`తో పలకరించారు. ఇద్దరు కూడా ఈ రసవత్తర పోటీలో విజయాలు చూశారు. కట్ చేస్తే.. ఐదేళ్ళ అనంతరం ఈ ఇద్దరు సీనియర్ స్టార్స్ మరోమారు పోటీకి సిద్ధమవుతున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. చిరంజీవి కథానాయకుడిగా `గాడ్ ఫాదర్` పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మాలీవుడ్ బ్లాక్ బస్టర్ `లూసీఫర్`కి రీమేక్ వెర్షన్ గా తయారవుతున్న ఈ పొలిటికల్ డ్రామాని `హనుమాన్ జంక్షన్` ఫేమ్ మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ భారీ బడ్జెట్ మూవీని దసరా సీజన్ లో రిలీజ్ చేయబోతున్నట్లు వినిపిస్తోంది. మరోవైపు బాలయ్య - `క్రాక్` కెప్టెన్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా విజయ దశమి లక్ష్యంగా నిర్మాణం జరుపుకుంటోందని సమాచారం. సో.. 2022 దసరా బరిలో చిరంజీవి వర్సెస్ బాలయ్య కి స్కోప్ ఉన్నట్లే అన్నమాట. మరి.. ఈ సారి కూడా ఈ ఇద్దరు టాప్ స్టార్స్ సక్సెస్ అందుకుంటారేమో చూడాలి.