English | Telugu

మనసు మార్చుకున్న యశ్ రాజ్ ఫిలిమ్స్.. తెలుగునాట వార్-2 పరిస్థితి ఏంటి..?

జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రానున్న 'వార్-2'.. ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఇండియన్ టాప్ స్టార్స్ ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో 'వార్-2'పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా సంచలనాలు సృష్టించడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ స్టార్డంతో తెలుగునాట భారీ వసూళ్లు రాబడుతుందని అందరూ భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ కి భారీ డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది.

యశ్ రాజ్ ఫిలిమ్స్ తమ సినిమాలను సొంతంగా రిలీజ్ చేసుకుంటూ ఉంటుంది. 'వార్-2'ని కూడా తెలుగు స్టేట్స్ లో ఓన్ గా రిలీజ్ చేయాలని మొదట భావించింది. అయితే ఎన్టీఆర్ నటించడంతో ఈ సినిమా రైట్స్ తీసుకోవడానికి తెలుగు నిర్మాతలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో యశ్ రాజ్ ఫిలిమ్స్ మనసు మార్చుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పలువురు తెలుగు నిర్మాతలతో చర్చలు మొదలయ్యాయట. ఎన్టీఆర్ సన్నిహితుడు, ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈ రేస్ లో ముందు ఉన్నట్లు తెలుస్తోంది. వార్-2 తెలుగు రాష్ట్రాల హక్కులను యశ్ రాజ్ ఫిలిమ్స్ రూ.100 కోట్లకు కోట్ చేయగా.. నాగవంశీ రూ.80 కోట్లు ఆఫర్ చేశారట. ఫైనల్ గా రూ.90 కోట్లకు డీల్ కుదిరేలా ఉందని అంటున్నారు.

డబ్బింగ్ సినిమా అయినప్పటికీ కేవలం ఎన్టీఆర్ ఉండటంతోనే 'వార్-2'కి తెలుగునాట ఇంత డిమాండ్ ఉందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ గత చిత్రం 'దేవర' డివైడ్ టాక్ తోనూ.. తెలుగు స్టేట్స్ లో ఏకంగా రూ.160 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. 100 కోట్ల లోపు షేర్ టార్గెట్ తో బరిలోకి దిగనున్న వార్-2.. హిట్ టాక్ వస్తే తెలుగునాట ఓ రేంజ్ ప్రాఫిట్స్ చూస్తుంది అనడంలో సందేహం లేదు.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.