English | Telugu
8 గంటల్లో ఇంజక్షన్ ఇవ్వకపోతే హీరోయిన్ ప్రాణాలకి ప్రమాదం.. ఇది సినిమా కాదు జీవితం
Updated : Jul 1, 2025
పద్దెనిమిదేళ్ల వయసులోనే 1994 సంవత్సరానికి సంబంధించి 'మిస్ యూనివర్స్' గా నిలిచి, ఇండియాకి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టిన ఘనతని దక్కించుకున్నారు 'సుస్మితాసేన్'(Sushmita sen). 1952 వ సంవత్సరంలో ప్రారంభమైన మిస్ యూనివర్స్ పోటీల్లో ఇండియాకి తొలి విశ్వ సుందరి కిరీటాన్ని అందించిన భారతీయురాలిగా కూడా సుస్మిత రికార్డు సృష్టించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో అగ్ర దర్శకుడు మహేష్ భట్(Mahesh bhatt)తెరకెక్కించిన 'దస్తక్' తో సినీ రంగ ప్రవేశం చేసి సుమారు ముప్పై చిత్రాల వరకు నటించింది.
రీసెంట్ గా సుస్మిత ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు 2014 లో 'ఆటో ఇమ్యూన్ రకానికి చెందిన అడిసన్ డిసీజ్' అనే అరుదైన వ్యాధి బారిన పడ్డాను. దాంతో శరీరంలో కీలకమైన అడ్రినల్ గ్రంధులు కార్టిసాల్ హార్మోన్ ని ఉత్పత్తి చెయ్యడం ఆగిపోయింది. ఫలితంగా ప్రతి 8 గంటలకి ఒకసారి హైడ్రో కార్టిస్టోన్ అనే 'స్టెరాయిడ్' తీసుకోవడం తప్పనిసరి. ఒక వేళ ఆ స్టెరాయిడ్ ని తీసుకోవడం ఆపితే ప్రాణాలు పోయే పరిస్థితి. అయితే ఈ పరిస్థితిని చాలా బలంగా మార్చుకున్నాను. కేవలం మందులపైనే ఆధారపడకుండా, నా శరీరంపై ప్రేమతో పోరాటం చేయాలనుకున్నాను. దాంతో వ్యతిరేక దిశలో నడవడం. యోగా, జిమ్నాస్టిక్, డైలీ వ్యాయాయం ద్వారా శరీరాన్ని బలంగా మార్చుకున్నాను. అవే నాకు మళ్ళీ జీవితాన్ని ఇచ్చాయని చెప్పుకొచ్చింది.
సుస్మిత తెలుగులో నాగార్జున(Nagarjuna)తో కలిసి 'రక్షకుడు' అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. 1997 లో వచ్చిన ఈ మూవీ మిశ్రమ ఫలితాన్ని అందుకోగా ప్రవీణ్ గాంధీ(Praveen gandhi)దర్శకుడిగా వ్యవహరించాడు. కె టి కుంజుమోహన్ నిర్మాణ సారధ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది.