English | Telugu

అల్లు అర్జున్ దెబ్బ అదుర్స్..నాగబాబు ఔట్

ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ ఇద్దరు కలిసినా ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన ఎవరో కాదు కొణిదెల నాగబాబు. నటుడు, నిర్మాత కంటే మెగా బ్రదర్ గానే ఎక్కువ గుర్తింపుని పొందాడు. ఎలాంటి ఇష్యు మీద అయినా ఎంతటి పర్సన్ మీద అయినా డేర్ అండ్ డాషింగ్ గా మాట్లాడటం ఆయన స్టైల్. అంతటి వ్యక్తి తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది

అల్లు అర్జున్ ఉరఫ్ బన్నీకి, నాగబాబు కి ఉన్న రిలేషన్ గురించి అందరకి తెలిసిందే. బన్నీ ఇటీవల తన స్నేహితుడు ఎంఎల్ఏ గా పోటీ చేస్తుంటే అతని గెలుపు కోసం ప్రచారానికి వెళ్ళాడు. ఆ తర్వాత నాగ బాబు తన ట్విట్టర్ లో మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మా వాడే అంటూ ట్వీట్ చేసాడు. ఇది అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేసిందనే విషయం అందరకి అర్ధమయ్యింది. దాంతో బన్నీ ఫ్యాన్స్ నాగబాబు కి రివర్స్ కౌంటర్లు వేస్తు ట్వీట్ ల మీద ట్వీట్లు చేస్తు వస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు వేల సంఖ్యలో ఉన్న బన్నీ అభిమానులు ట్వీట్ లు చేస్తున్నారు. దీంతో నాగబాబు ట్విటర్ నుంచి వైదొలిగాడు. నాగ బాబు సడన్ గా తీసుకున్న ఈ నిర్ణయం సినీ పరిశ్రమలలోను పబ్లిక్ లోను వైరల్ గా మారింది

నాగబాబు జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ గా పని చేస్తున్నాడు. ఆ హోదాలోనే బన్నీ మీద ట్వీట్ చేసాడు. కానీ ఒక్కటి మాత్రం నిజం. మెగా ఫ్యాన్స్ చాలా మంది బన్నీ జనసేన తరుపున కాకుండా వేరే పార్టీ అభ్యర్థి ప్రచారానికి వెళ్లడం మీద కోపంగానే ఉన్నారు. వాళ్ళ కోపం పుష్ప 2 కి ఎంత వరకు పని చేస్తుందో చూడాలి. లేక సినిమా వేరు రాజకీయం వేరు అనే కాన్సెప్ట్ కి దాసోహం అవుతారో

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.