English | Telugu
ఆ హీరోయిన్ తో ప్రభాస్ పెళ్లి.. అఫీషియల్ గా అనౌన్స్ చేసిన డార్లింగ్!
Updated : May 17, 2024
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకోవాలని 'బాహుబలి-2' కోసం అప్పుడు ప్రేక్షకులు ఎంతలా ఎదురుచూశారో.. ప్రభాస్ (Prabhas) పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా? అని అందరూ అంతలా ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే ఆరోజు రాబోతుంది. స్వయంగా ప్రభాసే ఈ విషయాన్ని రివీల్ చేశాడు.
రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇప్పటికే నలభైల్లోకి అడుగుపెట్టాడు. బాహుబలి రాకముందు నుంచే పదేళ్లుగా ప్రభాస్ పెళ్లి (Prabhas Marriage) గురించి చర్చ నడుస్తోంది. ఒకసారి ప్రముఖ హీరోయిన్ తో పెళ్లి అని, మరోసారి బంధువుల అమ్మాయితో అంటూ.. ఇలా ఎన్నోసార్లు ప్రభాస్ పెళ్లి వార్తలు వచ్చాయి. కానీ ఏదీ నిజం కాలేదు. ఇటీవల కనీసం అలాంటి వార్తలు కూడా రావడం లేదు. దీంతో బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ లా ప్రభాస్ కూడా సింగిల్ గా మిగిలిపోతాడా అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి సమయంలో ఊహించని ప్రకటనతో సర్ ప్రైజ్ చేశాడు ప్రభాస్.
తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ప్రభాస్ ఓ స్టోరీ పెట్టాడు. అందులో "డార్లింగ్స్.. మొత్తానికి ఒక స్పెషల్ పర్సన్ జీవితంలోకి రాబోతున్నారు.. వెయిట్ చేయండి" అంటూ ప్రభాస్ రాసుకొచ్చాడు. దీంతో ఆ స్పెషల్ పర్సనా ఎవరా? అని అందరూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. కొందరు అభిమానులైతే అనుష్క శెట్టి (Anushka Shetty) అయ్యుంటుందని కామెంట్స్ పెడుతున్నారు. మరి ప్రభాస్ జీవితంలోకి రాబోతున్న ఆ స్పెషల్ పర్సన్ ఎవరు? అనేది త్వరలోనే రివీల్ అయ్యే అవకాశముంది.