English | Telugu

నాగ్ కి అమ్మాయిల పిచ్చి ప‌ట్టుకొంది

ఔను. నాగార్జున‌కి అమ్మాయిల పిచ్చి ప‌ట్టుకొంది. రోజుకో అమ్మాయితో తిరుగుతున్నాడు. ఈరోజు సంధ్య‌, రేపు స్వాతి, నిన్న రీటా.. ఎల్లుండి మ‌రొక‌రు! నాగ్ ఇంట్లోనూ ఈ వ్య‌వ‌హారం తెల్సిపోయింది. అయినా స‌రే, అమ్మాయిల వెంట ప‌డ‌డం మాన‌డం లేదు. ఈ పిచ్చి ముదిరి పీక్‌కి వెళ్లిపోతోంది. అయ్యో.. నిజం అనుకొంటున్నారా?? ఇదంతా సినిమా క‌థండీ బాబూ. నాగార్జున ద్విపాత్రాభిన‌యం చేస్తున్న చిత్రం సొగ్గాడే చిన్ని నాయిన‌. క‌ల్యాణ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమాలో నాగ్ బ‌హు రొమాంటిక్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. త‌న‌కు అమ్మాయిల పిచ్చి. రోజుకో అమ్మాయితో ఎలా మానేజ్ చేశాడు.?? ఈ అమ్మాయిల పిచ్చి త‌గ్గ‌డానికి కుటుంబ స‌భ్యులేం చేశారు..?? అనే స‌ర‌దా క‌థ‌తో సాగే చిత్ర‌మిది. సోగ్గాడే చిన్ని నాయిక స్టోరీ లైన్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో నాగ్ తండ్రీ కొడుకులుగా న‌టిస్తున్నారు. తండ్రికి అమ్మాయిల పిచ్చి... కొడుకేమో అమాయ‌కుడు. మ‌రి ఈ ఇద్ద‌రూ క‌ల‌సి చేసే హంగామా న‌వ్వులు పంచుతుంద‌ట‌. ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ప్ర‌త్యేకంగా తీర్చిదిద్దిన సెట్‌లో షూటింగ్ జ‌రుగుతోంది. ర‌మ్య‌కృష్ణ‌, లావ‌ణ్య త్రిపాఠీ క‌థానాయిక‌లు. మ‌రో ఇద్ద‌రు ముగ్గురు హీరోయిన్లు అతిథి పాత్ర‌ల్లో ఇలా క‌నిపించి అలా మాయ‌మైపోతార‌ట‌. మొత్తానికి మ‌న్మ‌థుడు నాగ్‌... మ‌రోసారి రొమాంటిక్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌న్న‌మాట‌.