English | Telugu

హీరో కోసం కొట్టుకొన్న ఇద్ద‌రు హీరోయిన్లు

బాలీవుడ్‌లోనే కాదు.. టాలీవుడ్‌లోనూ రొమాంటిక్ వ్య‌వ‌హారాలు బాగానే న‌డుస్తున్నాయి. గ‌తంలో ఓ హీరోయిన్ కోసం ఇద్ద‌రు హీరోలు కొట్టుకొన్నార‌న్న వార్త వ‌చ్చింది. ఆ హీరోయిన్ ఓ పంజాబీ ప‌డుచులెండి. తెలుగు నాట వార‌స‌త్వ హీరోగా చ‌లామ‌ణీ అవుతున్న ఓ యువ‌హీరో ఆమెతో ప్రేమాయ‌ణం సాగిస్తున్నాడ‌ని, ఆ హీరోయిన్ మ‌రో హీరోతో కాస్త క్లోజ్ గా ఉండేస‌రికి... మ‌నోడు రెచ్చిపోయి గొడ‌వ పెట్టుకొన్నాడ‌ని వార్త‌లొచ్చాయి. అందులో ఏ మాత్రం నిజం ఉందో తెలీదుగానీ.. ఇక్క‌డ మాత్రం ఓ హీరో కోసం ఇద్ద‌రు హీరోయిన్లు కొట్టుకొన్నార‌ట‌. 2013లో ఓ హిట్టుకొట్టి... నాలుగైదు సినిమాల్ని త‌న ఖాతాలో వేసుకొన్న ఓ యువ హీరో త‌నతో పాటు ప‌ని చేసిన ఇద్ద‌రు హీరోయిన్ల‌తో య‌మ క్లోజ్‌గా ఉంటున్నాడు. అందులో ఒక‌మ్మాయి.. ఇప్పుడు లీడింగ్ పొజీష‌న్‌లో ఉంది. త‌న‌తోనే కాకుండా మ‌రో హీరోయిన్‌తోనూ క్లోజ్ గా ఉంటున్నాడ‌న్న సంగ‌తి ఆమెకు తెలిసి..ఆ అమ్మాయితో గొడ‌వ పెట్టుకొంది. ఇద్ద‌రూ 'నువ్వెంత అంటే నువ్వెంత‌' అనుకొనే రేంజ్‌లోకి వెళ్లిపోయార‌ట‌. చివ‌రికి ఈ యువ హీరో కూడా స‌ర్దుబాటు చేయ‌లేక‌.. చేతులెత్తేశాడ‌ట‌. అలా రెంటికీ చెడ్డ రేవ‌డిలా త‌యారైంది మ‌న యంగ్ హీరో బ‌తుకు. అన్న‌ట్టు ఈ హీరో ఇప్పుడో వెరైటీ టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు. ఇద్ద‌రు హీరోయిన్ల‌లో ఒక‌మ్మాయి టాప్ స్టార్ల‌తో సినిమాలు చేస్తోంది. మ‌రింత‌కీ ఈ ముగ్గురూ ఎవ‌రో మీరేమైనా గెస్ చేయ‌గ‌ల‌రా??

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.