English | Telugu

ఎన్టీఆర్ బాధపడితే..నవ్వుతున్నారు!

ఎన్టీఆర్ అభిమానులు ఆశగా చూస్తున్న 'రభస' సినిమా వెనక్కి వెళ్ళడంతో ఆయన బాధపడుతున్నాడట. మొదటి నుంచి ఈ సినిమా ఆగస్ట్‌ 15న విడుదలచేస్తామని చెప్పిన ప్రొడ్యూసర్ సడన్ ప్లాన్ మార్చేసరికి ఎన్టీఆర్ ఆగ్రహంగా వున్నాడట. బెల్లంకొండ సురేష్ తన కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ లాంచింగ్ చిత్రం అల్లుడు శీనుని అర్దాంతరంగా థియోటర్స్ నుంచి లేపేయటానికి మనసొప్పక వాయిదా అడిగాడని సమాచారం. అయితే రభస’ రిలీజ్‌ వాయిదా పడడంతో చిన్న సినిమాల నిర్మాతలు ఆనందంగా వున్నారు. రభస రిలీజ్‌ అయితే తమ చిత్రాల్ని ఎక్కడ ఎత్తేస్తారో అని భయపడ్డ నిర్మాతలు తమ సినిమాల రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఈ వారంలో గాలిపటం, గీతాంజలి చిత్రాలు వస్తుండగా ఆగస్ట్‌ 15న సూర్య 'సికందర్'.. మారుతి నిర్మించిన లవర్స్‌తో పాటు మంచు విష్ణు నటించిన అనుక్షణం రిలీజ్‌ అవుతోంది. 'రభస' వాయిదా వల్ల ఇంతమందికి ఛాన్స్ దొరికింది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.