English | Telugu
గంధర్వమహల్ లో ఎన్టీఆర్ రభస
Updated : Apr 22, 2014
"రామయ్య వస్తావయ్యా" తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నచిత్రం "రభస". ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ మణికొండలోని గంధర్వ మహల్ లో జరుగుతోంది. ఎన్టీఆర్, సమంత ఇందులో పాల్గొంటున్నారు. ఇటీవలే దర్శకుడి అనారోగ్యం కారణంగా షూటింగ్ ఆపేసారు. కానీ మళ్ళీ దర్శకుడు అనారోగ్యం నుండి కోలుకోవడంతో షూటింగ్ ప్రారంభించారు. నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా ప్రణీత నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో తారక్ కొత్త లుక్ లో కనిపించబోతున్నాడని తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.