English | Telugu
హాలీవుడ్‌తో పోటీ పడగల సత్తా మనకుంది
Updated : Jun 23, 2014
కాలీవుడ్‌లో గజిని, తుపాకీ వంటి చిత్రాలు రూపొందించి దక్షిణాదిలో పాపులర్ డైరెక్టర్ల లిస్టులో స్థానం సంపాదించుకున్న తమిళ దర్శకుడు మురుగదాస్. ఆయన రూపొందించే వైవిధ్యభరితమైన కథలు బాలీవుడ్ ని ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్ నటించిన హింది వర్షన్ గజినీ కూడా దర్శకత్వం వహించిన మురుగదాస్ ఇండియన్ సినిమాలకు హాలీవుడ్ తో పోటీ పడే సత్తా వుందన్నారు. ఇక్కడి కంటెంట్‌కి హాలివుడ్ స్థాయి వున్నప్పటికీ, మార్కెట్ విషయంలో అంతర్జాతీంగా మార్కెటింగ్ చేసుకోవడంలో, సినిమాలు రూపొందించటంలో ఇంకా మన స్థాయి పెంచుకోవలన్నారు. అలాగే యాక్షన్, వార్ చిత్రాలకు కావలసిన బడ్జెట్ విషయంలో మనం వారితో పోటీ పడాలేమన్నారు. అయితే తప్పకుండా ఇంటలిజెంట్, సెన్సిబుల్ యాక్షన్ చిత్రాలు తియ్యడంలో మాత్రం హాలీవుడ్ కి పోటీ ఇవ్వగలమని ఈ ప్రముఖ దర్శకుడు అంటున్నారు.