English | Telugu

ప్రధానిని కలిసిన మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్


ఎన్నికల ముందు ఓట్ కాంపేన్ తో పాటు భారతదేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న అనేక సామాజిక అంశాలను తీసుకుని వినూత్నంగా రూపొందిచిన 'సత్యమేవ జయతే' కార్యక్రమం గురించి చర్చించడానికి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ప్రధాని నరేంద్ర మోడీని సోమవారం కలుసుకున్నారు. 'సత్యమేవ జయతే' కార్యక్రమానికి వ్యాఖ్యతగా అమీర్ ఖాన్ వ్యవహరించిన సంగతి విధితమే. ఈ కార్యక్రమంలో చూపించిన అంశాలను తప్పకుండా పరిశీలస్తామని ప్రధాని మోడి మాట ఇచ్చినట్లు అమీర్‌ఖాన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు. ప్రధాని తన విలువైన సమయాన్ని తన కోసం కేటాయించినందుకు అమీర్ కృతజ్ఞతలు తెలిపారు.

సౌత్ బ్లాక్ లో జరిగిన ఈ సమావేశాన్ని కర్టసీ కాల్ గా ప్రధాని కార్యాలయం ఉదహరించింది. ప్రధాని అధికారిక వెబ్‌సైట్ ఈ ఫోటోలను విడుదల చేసింది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.