English | Telugu
దర్శకుడుతో సీతారామం మృణాల్..సోషల్ మీడియాలో సంచలనం!
Updated : Jan 1, 2024
సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన మృణాల్ ఠాకూర్ ఆ సినిమాతో తెలుగువారి అభిమానకధానాయికిగా మారిపోయింది. ఆమె కోసమే సీతారామం ని ఒకటికి రెండు సార్లు చుసిన వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారంటే మృణాల్ క్రేజ్ ని అర్ధం చేసుకోవచ్చు. ఇటీవలే నాని హీరోగా వచ్చిన హాయ్ నాన్నలో కూడా అధ్బుతంగా నటించి మృణాల్ ని మర్చిపోవడం ఇక మా వాళ్ళ కాదని తెలుగు ప్రేక్షకులంతా ముక్తకంఠంతో అంటున్నారు. ఆ మూవీలో యష్ణ గా మృణాల్ నటన నభోతో న భవిష్యత్తో అన్న రీతిన సాగింది. అంతే కాదు ఫ్యూచర్ లో తెలుగు సినిమాని మృణాల్ ఏలుతుందనే పేరుని కూడా ఆమె సంపాదించింది. తాజాగా ఆమె గురించి వస్తున్న ఒక వార్త ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది.
మృణాల్ ఠాకూర్ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.ఒక ఐదు సినిమాలు దాకా తన ఖాతాలో ఉన్నాయి. ఇప్పుడు వాటి సరసన ఇంకో సినిమా వచ్చి చేరింది. ప్రముఖ హీరో దర్శకుడు డాన్స్ మాస్టర్ అయినటువంటి రాఘవేంద్ర లారెన్స్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతుంది. ఈ మూవీలో లారెన్స్ తో మృణాల్ జత కట్టబోతుందనే ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాబోతుందని కూడా అంటున్నారు.
మోస్ట్ ప్రేస్టీజియస్ట్ మూవీ గా తెరకెక్కుతున్న ఆ చిత్రానికి శ్రీరామ రక్ష అనే టైటిల్ ని ఫైనల్ చేసే యోచనలో చిత్ర బృందం ఉంది. అన్ని అనుకున్నట్టు కుదిరి లారెన్స్, మృణాల్ కాంబినేషన్ లో కనుక ఆ సినిమా తెరకెక్కితే అదొక పెద్ద సంచలనమే అవుతుంది.