English | Telugu

మత్తు ఎక్కిస్తున్న నిధి!

శ్రీ‌ సింహా హీరోగా రితేష్ రానా దర్శకత్వంలో రూపొందిన సినిమా 'మత్తు వదలరా'. మైత్రి మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ కామెడీ థ్రిల్లర్ 2019 లో విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా 'మత్తు వదలరా-2' (Mathu Vadalara 2) వస్తోంది. సెప్టెంబర్ 13న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) లుక్ ని రివీల్ చేశారు మేకర్స్.

'మత్తు వదలరా-2'లో నిధి పాత్రలో ఫరియా నటిస్తోంది. ఆమె పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్ లో చేతిలో గన్ పట్టుకొని స్టైలిష్ గా, గ్లామరస్ గా ఫరియా లుక్ ఉంది. ఈ సినిమాలో ఆమె గ్లామర్ ను ఒలకపోయడంతో పాటు, యాక్షన్ కూడా అదరగొట్టనుందని పోస్టర్ ని బట్టి అర్థమవుతోంది.

'జాతిరత్నాలు' లాంటి కామెడీ ఫిల్మ్ తో హీరోయిన్ గా పరిచయమై.. చిట్టిగా అలరించింది ఫరియా. ఆ తర్వాత ఆమెకి ఆ స్థాయి ఎంటర్టైనర్ పడలేదు. ఇప్పుడు 'మత్తు వదలరా-2'తో ఆ లోటు తీరుతుందేమో చూడాలి.