English | Telugu
సలార్ ని హనుమాన్ దాటాడు
Updated : May 15, 2024
సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ హనుమాన్(hanuman)సిల్వర్ స్క్రీన్ వద్ద 350 కోట్ల రూపాయలకి పైగా వసులు చేసింది.దాన్ని బట్టి హనుమాన్ స్టామినా ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. ఓటిటి లోను తన సత్తా చాటింది. తాజాగా మరో అరుదైన రికార్డుని సాధించింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్,నాగార్జున, మహేష్ బాబు,పవన్ కళ్యాణ్,ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ ల కే కాదు నాకంటూ ఒక రికార్డు ఉంటుందని నిరూపించాడు
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ హోదాలో హనుమాన్ ఇటీవల ప్రముఖ టెలివిజన్ ఛానల్ జీ తెలుగులో ప్రసారం అయ్యింది.అందరి అంచనాలని తలకిందులు చేస్తు 11 టిఆర్పి రేటింగ్ ని దక్కించుకుంది. అసలు గత కొంత కాలం నుంచి ఎంత పెద్ద హీరో సినిమాకి అయినా టిఆర్ పి రేటింగ్స్ ఆరు కూడా దాటడం లేదు. అలాంటిది హనుమాన్ 11 రేటింగ్ ని దక్కించుకుందంటే ఎంతటి ప్రేక్షక ఆదరణ పొందిందో అర్ధం చేసుకోవచ్చు. ప్రభాస్ సలార్ ఆరు రేటింగ్ ని దక్కించుకుంది.
తేజ సజ్జా, అమృత అయ్యర్ హీరో హీరోయిన్లుగా చేసిన హనుమాన్ లో వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పై కే నిరంజన్ రెడ్డి నిర్మించగా అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు మ్యూజిక్‌ను ఇచ్చారు.హనుమాన్ శక్తీ ముందు ఎవరు తట్టుకోలేరని పురాణాల్లో ప్రస్తావించింది నూటికి నూరుపాళ్ళు నిజం