English | Telugu
ఆసుపత్రి పాలైన మెగా మదర్ అంజనాదేవి.. అసలేం జరిగింది?
Updated : Jun 24, 2025
చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల తల్లి అంజనా దేవి (Anjana Devi) స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం ఉండగా.. తల్లికి అనారోగ్యంగా ఉందన్న సమాచారం అందటంతో.. పవన్ కళ్యాణ్ వెంటనే హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్ళినట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. అయితే సమావేశం మొదలైన కాసేపటికి.. తల్లి అంజనా దేవి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం రావడంతో.. సీఎంకి, సహచర మంత్రులకు విషయం చెప్పి.. పవన్ హైదరాబాద్ కి బయలుదేరినట్లు న్యూస్ వినిపిస్తోంది.
ఇటీవల కూడా అంజనా దేవి తీవ్ర అనారోగ్యం పాలైనట్లు వార్తలొచ్చాయి. కానీ, ఆ వార్తలను మెగా కుటుంబం ఖండించింది. రెగ్యులర్ చెకప్ కోసమే హాస్పిటల్ కి వెళ్లినట్లు తెలిపింది. ఇప్పుడు మరోసారి అంజనా దేవి ఆరోగ్యం గురించి వార్తలొస్తున్నాయి. మరి ఇందులో వాస్తవమెంతో తెలియాల్సి ఉంది.