English | Telugu

ఆర్థిక లావాదేవీల్లో ఫ్రాడ్ జరిగిందా! సమంత పరిస్థితి ఏంటి?

అద్భుతమైన పెర్ఫార్మెన్సుని ప్రదర్శించే నటిగా 'సమంత'(Samantha)కి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ తెలిసిందే. 2023 లో 'విజయ్ దేవరకొండ'(VIjay Devarakonda)తో చేసిన ఖుషి తర్వాత, గత నెల మే 9 న 'శుభం' అనే హర్రర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ మూవీలో ప్రత్యేకమైన క్యారక్టర్ ని పోషించడంతో పాటు నిర్మాతగాను వ్యవహరించింది. మరో వైపు హిందీలో వెబ్ సిరీస్ లు కూడా చేస్తు, గత ఏడాది నవంబర్ 6 న 'సిటాడెల్ హనీబన్నీ' తో తనేంటో ప్రూఫ్ చేసుకుంది.

ప్రస్తుతం సమంత ఖాతాలో 'రక్త్ బ్రహ్మాండ్'(Rakt Brahmand)అనే మరో హిందీ వెబ్ సిరీస్ ఉంది. 'ది బ్లడీ కింగ్ డమ్' అనేది ఉప శీర్షిక. యాక్షన్ ఫాంటసీ గా తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో బాలీవుడ్ క్రేజీ హీరో ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా చేస్తున్నాడు. 'సిటాడెల్' ని తెరకెక్కించిన రాజ్ & డికె (Raj,dk)ద్వయం,ప్రముఖ ఓటిటి దిగ్గజం 'నెట్ ఫ్లిక్స్'(Netflicx)కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మేరకు చాలా రోజుల క్రితమే అధికార ప్రకటన వచ్చింది. కానీ షూట్ కి వెళ్లకముందే ఈ సిరీస్ కి సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో ఫ్రాడ్ జరిగిందని, దీంతో ఈ సిరీస్ ఆగిపోయిందనే వార్తలు బాలీవుడ్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విషయంపై 'నెట్‌ఫ్లిక్స్' సంస్థ మేకర్స్‌తో చర్చలు జరిపిందనే టాక్ కూడా వినపడుతుంది. 'తుంబాడ్' తో తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు 'రాహి అనిల్ బర్వే'(Rahi anil Barve)ఈ సిరీస్ కి డైరెక్ట్ చేయాల్సి ఉంది. దీంతో హిందీ కి సంబంధించి ఈ ప్రాజెక్ట్ సమంత కెరీర్ కి ఎంత ఇంపార్టెంటో అర్ధం చేసుకోవచ్చు. ఇక రక్త్ బ్రహ్మాండ్ ఆగిపోయిందనే వార్త సోషల్ మీడియాలో వస్తుండటంతో సమంత సినీ కెరీర్ పై రకరకాల మాటలు వినపడుతున్నాయి. సమంత చాలా రోజుల క్రితమే 'మా ఇంటి బంగారం' అనే మూవీని అనౌన్స్ చేసింది. కానీ ఇంతవరకు ఆ చిత్రం స్టార్ట్ కాలేదు.


అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.