English | Telugu
ఓటిటిలోకి అడుగుపెడుతున్న మంచు లక్ష్మి..పేరు ఇదే
Updated : Oct 15, 2025
మంచు మోహన్ బాబు(Manchu MOhanbabu)నట వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన 'మంచు లక్ష్మి(Manchu lakshmi),ఏ క్యారక్టర్ లో అయిన అద్భుతమైన పెర్ఫార్మ్ ని ప్రదర్శించే నటిగా మంచి గుర్తింపు పొందింది. కొంత కాలం గ్యాప్ తర్వాత గత నెల సెప్టెంబర్ 19 న 'దక్ష'(Daksha)అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో మోహన్ బాబు కూడా ఒక ముఖ్యమైన క్యారక్టర్ లో చేసి తన నటనతో మెప్పించాడు.
ఇప్పుడు ఈ చిత్రం ఓటిటి వేదికగా సందడి చెయ్యడానికి రెడీ అవుతుంది. అక్టోబర్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్టుగా మంచు లక్ష్మి ఎక్స్ వేదికగా అధికారకంగా వెల్లడి చేసింది. మర్డర్ మిస్టరీ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కగా, మంచు లక్ష్మి పోలీస్ ఆఫీసర్ గా ఎంతో ఎనర్జీ తో చేసింది. హైదరాబాద్ లో ఒక వ్యక్తి అనుమానాస్పద రీతిలో చనిపోతే, సదరు కేసుని మంచు లక్ష్మి ఇన్విస్టిగేషన్ చేస్తుంది. ఈ లోపు ఒక ఫార్మా కంపెనీ కి చెందిన బడా వ్యక్తి చనిపోతాడు. ఈ రెండు కేసుల్లోని క్లూస్ ఒకేలా ఉంటాయి.
ఈ రెండు హత్యలకి సంబంధం ఏంటి? మంచు లక్ష్మి ఈ కేసుల్ని ఎలా డీల్ చేసిందనేది ఎంతో ఆసక్తి కరంగా ఉండటంతో పాటు మోహన్ బాబు క్యారక్టర్ ఏంటనేది కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. మరి మిస్టరీ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులని నచ్చే అవకాశాలు ఉన్నాయి. వంశీకృష్ణ మల్లా(Vamsikrishna Malla)దర్శకత్వంలో మంచు మోహన్ మోహన్ బాబు సొంతంగా నిర్మించగా సముద్రఖని, సిద్ధిక్, విస్వంత్ లు కీలక పాత్రలు పోషించారు.