English | Telugu

‘బిగ్ బ్ర‌ద‌ర్’ డైరెక్టర్‌కి గుండెపోటు

ప్ర‌ముఖ మ‌ల‌యాళ డైరెక్ట‌ర్ సిద్ధిఖీ గుండె పోటుతో హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. ఆయన వ‌య‌సు 69 ఏళ్లు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి క్రిటికల్‌గా ఉంద‌ని స‌మాచారం.ఇది ఆయ‌న అభిమానుల‌ను, సినీ ప్ర‌ముఖులను ఆందోళ‌న‌ల‌కు గురి చేస్తుంది. ఆయ‌న తెలుగు, త‌మిళ, హిందీ సినిమాలను డైరెక్ట్ చేశారు. లాల్ అనే యాక్ట‌ర్‌, డైరెక్ట‌ర్‌తో క‌లిసి ప‌లు సినిమాల‌ను సిద్ధిఖీ తెర‌కెక్కించారు. తెలుగు సినిమాల విష‌యానికి వ‌స్తే హీరో నితిన్‌తో మారో అనే మూవీని రూపొందించారు. డైరెక్ట‌ర్‌గానే కాకుండా న‌టుడిగానూ కొన్ని సినిమాల్లో న‌టించి మెప్పించారు.

అలాగే బుల్లి తెర‌పై ప‌లు షోస్‌లో జ‌డ్జ్‌గానూ ఆక‌ట్టుకున్నారు. 2020లో మోహ‌న్ లాల్‌తో క‌లిసి బిగ్ బ్ర‌ద‌ర్ సినిమాను తెర‌కెక్కించారు. సిద్ధిఖీ కోలుకోవాల‌ని అంద‌రూ కోరుకుంటున్నారు. ఇన్ హరిహ‌ర్‌న‌గ‌ర్‌, రామ్‌జీ రావ్ స్పీకింగ్, వియ‌త్నాం కాలనీ, గాడ్ ఫాద‌ర్‌, కాబూలీవాలా, బిగ్ బ్ర‌ద‌ర్ సినిమాల‌ను డైరెక్ట్ చేశారు సిద్ధిఖీ. తెలుగులో నితిన్‌తో సిద్ధిఖీ చేసిన మారో సినిమా ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాక‌పోవ‌టంతో ఆయ‌న మ‌ళ్లీ తెలుగు సినిమాలు చేయ‌లేదు.

సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులు గుండెపోటుతో క‌న్నుమూస్తున్నారు. రీసెంట్‌గా న‌టి ష‌ణ్ముగ ప్రియ భ‌ర్త గుండెపోటుతో క‌న్నుమూశారు. నిన్న న‌టి స్పంద‌న గుండె పోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు సిద్ధిఖీ గుండెపోటుతో క్రిటిక‌ల్ కండీష‌న్‌లో హాస్పిట‌ల్‌లో ఉన్నారు.