English | Telugu
'యానిమల్' కంటే తక్కువ.. 'డంకీ' కంటే ఎక్కువ!
Updated : Nov 17, 2023
ఈ డిసెంబర్ లో మూడు భారీ సినిమాలు విడుదల కానున్నాయి. అందులో ఒకటి టాలీవుడ్ కి చెందిన 'సలార్' కాగా, మిగతా రెండు బాలీవుడ్ కి చెందిన 'యానిమల్', 'డంకీ'. అయితే ఈ మూడు సినిమాలు కూడా నిడివి విషయంలో ఒక దానిని మించి ఒకటి అన్నట్టుగా పోటీ పడుతున్నాయి.
రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'యానిమల్'. అర్జున్ రెడ్డి దర్శకుడి నుంచి వస్తున్న సినిమా కావడంతో తెలుగులోనూ దీనిపై మంచి అంచనాలున్నాయి. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ నిడివి 3 గంటల 2 నిమిషాకు లాక్ చేసినట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ 'సలార్'. డిసెంబర్ 22న విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా నిడివి 2 గంటల 55 నిమిషాలని సమాచారం.
'పఠాన్', 'జవాన్' వంటి బ్లాక్ బస్టర్స్ తరువాత షారుఖ్ ఖాన్ నుండి వస్తున్న చిత్రం 'డంకీ'. రాజ్ కుమార్ హిరానీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ నిడివి 2 గంటల 40 నిమిషాలని తెలుస్తోంది.