English | Telugu
30 లోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ
Updated : Nov 17, 2023
నందమూరి బాలకృష్ణని దసరా విన్నర్ గా నిలబెట్టిన మూవీ భగవంత్ కేసరి. ఈ మూవీలో బాలకృష్ణ ప్రదర్శించిన నటన నభూతోనభవిష్యత్తు అన్న విధంగా ఉంటుంది. అన్ని వర్గాల వారిని అలరించిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకులనైతే విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త భగవంత్ కేసరికి ఇక తిరుగులేదని అనేలా చేస్తుంది.
భగవంత్ కేసరి మూవీ నేటితో 30 రోజుల్ని పూర్తిచేసుకుంది. దీంతో బాలయ్య అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో విషయం ఉండటంతో పాటుగా బాలయ్య నటనకి ఆడియన్స్ ఫిదా అవ్వడం వల్లే మూవీ దిగ్విజయంగా 30 వ రోజులోకి అడుగుపెట్టింది. అలాగే కలెక్షన్స్ కూడా ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికే ఎన్నో రికార్డు లని తన ఖాతాలో వేసుకున్న భగవంత్ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులని తన ఖాతాలో వేసుకోవడం ఖాయం.
ఇక భగవంత్ కేసరి 30 రోజులు పూర్తిచేసుకున్న విషయం మీద బాలయ్య అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఈ సినిమా ప్రభంజనం ఇక్కడితో ఆగిపోదని అర్ధ శతదినోత్సవాన్ని, శత దినోత్సవాన్ని కూడా జరుపుకోవడం ఖాయమని కూడా అంటున్నారు. అలాగే మా బాలయ్యకి ఇలాంటి రికార్డులు సృష్టించడం కొత్తేమి కాదని కాకపోతే మహిళా ప్రాధాన్యతని వివరించే ఈ సినిమా మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నామని కూడా అంటున్నారు. .షైన్ క్రియేషన్స్ పతాకంపై సాహు గారపాటి ,హరీష్ పెద్ది లు నిర్మించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా కాజల్, శ్రీ లీల , అర్జున్ రాంపాల్ తదితరులు నటించారు.