English | Telugu
'ఆదిపురుష్' కోసం ఏకంగా షోనే బుక్ చేసిన కృతి సనన్!
Updated : Jun 22, 2023
'ఆదిపురుష్' సినిమా విడుదలకు ముందు పలువురు ప్రముఖులు ఉచిత టికెట్లు పంపిణీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. విడుదల తర్వాత కూడా అదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. ఈ చిత్రంలో జానకి పాత్రలో నటించిన హీరోయిన్ కృతి సనన్ తాజాగా 'ఆదిపురుష్' ప్రదర్శితమవుతున్న థియేటర్ లో ఓ షో మొత్తాన్ని బుక్ చేశారు.
కృతి సనన్ కి తాను చదువుకున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటే ఎంతో అభిమానం. తన మూవీ ప్రమోషన్స్ ఆ స్కూల్ లో చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆ స్కూల్ లో చదువుతున్న స్టూడెంట్స్ కి 'ఆదిపురుష్' సినిమా చూపించాలన్న ఉద్దేశంతో ఢిల్లీలోని ఓ మల్టీప్లెక్స్ లో పూర్తిగా ఒక షోనే బుక్ చేశారు. అంతేకాదు స్టూడెంట్స్ తో తాను కూడా మరోసారి ఆదిపురుష్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. తాను చదువుకున్న స్కూల్ లోని స్టూడెంట్స్ కి ఉచితంగా సినిమా చూపించాలనే కృతి సనన్ ఆలోచన పట్ల ప్రశంసలు కురుస్తున్నాయి.
రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కిన 'ఆదిపురుష్'లో ప్రభాస్ శ్రీరాముడిగా నటించారు. టి. సిరీస్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. జూన్ 16న ఈ చిత్రం భారీస్థాయిలో విడుదలైంది. ఆరు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.410 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.