English | Telugu
ఆది సాయికుమార్ చేతుల మీదుగా జబర్దస్త్ శాంతి కుమార్ డైరెక్టర్ గా నాతో నేను మూవీ సాంగ్ రిలీజ్
Updated : Jun 23, 2023
జబర్దస్త్ ..ఖతర్నాక్ కామెడీ షో ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది. అలా ఎంతో మంది ఇప్పుడు కమెడియన్స్ గా రైటర్స్ గా టెక్నీషియన్స్ గా స్థిరపడ్డారు. సుధీర్ హీరోగా నిలబడ్డాడు, రాంప్రసాద్ రైటర్ గా, ఆది డైలాగ్ రైటర్ గా, వేణు డైరెక్టర్ గా మంచి ఫామ్ లో ఉన్నారు. ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్ శాంతి కుమార్ వంతు వచ్చింది. ఆయన డైరెక్టర్ గా మారి ఒక మూవీ తీయబోతున్నారు. మిమిక్రి ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన శాంతి కుమార్ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి నెమ్మదిగా టీంలీడర్ గా ఎదిగారు. ఐతే కొన్నాళ్ల క్రితం జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
సాయి కుమార్, ఆదిత్య ఓం ముఖ్యపాత్రల్లో ‘నాతో నేను’ అనే మూవీని తీస్తున్నారాయన. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మాటలు, కొన్ని పాటలు అన్ని శాంతికుమార్ ఆల్ ఇన్ వన్ గా తానే చేసుకోవడం మెచ్చుకోదగ్గ విషయం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీకి సంబందించిన ఒక సాంగ్ ని ఆది సాయికుమార్ రిలీజ్ చేశారు. "జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా నన్ను ఆదరించారు. ఇంకో అడుగు ముందుకేసి డైరెక్టర్ గా మారాను... ఇది నా తొలిప్రయాణం. ఈ సినిమాకు కథ, మాటలు, పాటలు అన్ని నేనే రాసుకొని కొత్త నిర్మాతల సహకారంతో సినిమా చేస్తున్నాను. ఈ సినిమాలో సాయి కుమార్ గారి పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. డైరెక్టర్ గా నేను చేసిన ఈ మూవీ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నానన్నారు" శాంతి కుమార్.