English | Telugu
తండ్రి కాబోతున్న కిరణ్ అబ్బవరం
Updated : Jan 21, 2025
ఎస్ఆర్ కళ్యాణ్ మండపం తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ని పొందిన హీరో కిరణ్ అబ్బవరం(KIran Abbavaram).అతి తక్కువ సమయంలోనే వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తు తన అభిమానులని అలరిస్తు వస్తున్నాడు.రీసెంట్ గా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన 'క'(Ka)అనే చిత్రంలో నటించి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని కూడా అందుకున్నాడు.
ఇక కిరణ్ అబ్బవరం గత ఏడాది ఆగస్టులో సహనటి రహస్య(Rahasya)ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు తమ తమ కెరీర్ లో మొదటి సినిమా 'రాజావారురాణివారు'లో కలిసి నటించే సమయంలో ప్రేమలో పడటంతో పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.ఇప్పుడు కిరణ్ అబ్బవరం తండ్రి కాబోతున్నాడు.ఈ విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా తెలియచేసాడు.ఈ సందర్భంగా తన భార్యతో పాటు కిరణ్ అబ్బవరం దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి.