English | Telugu

ఆ ఛాన్స్ పై రూమర్స్ నమ్మొద్దు

ఎన్టీఆర్‌, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రూపొందనున్న మూవీలో కాజల్ హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే. గత కొన్నిరోజులుగా ఈ ప్రాజెక్ట్ నుంచి కాజల్ తప్పుకుందని, రెమ్యునరేషన్ భారీగానే దాదాపు రెండు కోట్ల వరకు కాజల్ డిమాండ్ చేసిందనే ప్రచారం సాగుతోంది. దీంతో ఈ వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చుకోవాల్సివచ్చింది. ఈ సినిమాని మిస్సయ్యే చాన్స్‌లేదని కాజల్ మీడియాకి తెలియజేసింది. అలాగే రెమ్యునరేష్‌ని ఎక్కువ తీసుకున్నానని వస్తున్న వార్తలను నమ్మవద్దని తెలిపింది. కథను బట్టి ఒక్కోసారి గ్లామర్ రోల్స్ చేయాల్సి వస్తుందని, నా కష్టానికి మించి ఇప్పటికి వరకు ఒక్క రూపాయు కూడా ఎక్కువ తీసుకోలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం కాజల్ రామ్ చరణ్ గోవిందుడు, బాలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీగా వుంది.