English | Telugu
జోరు వానలో మనోజ్ 'కరెంట్ తీగ'
Updated : Aug 12, 2014
మంచు మనోజ్ తాజాగా నటిస్తోన్న చిత్రం కరెంట్ తీగ. తిరుపతిలో ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ చిత్రం క్లైమాక్స్ కోసం మంచు మనోజ్ జోరుగా కురుస్తున్న వర్షంలో విలన్స్‌తో అలుపు లేకుండా ఫైట్ చేశారు. నిన్నటితో ఈ ఫైట్ చిత్రీకరణ పూర్తయింది. వర్షంలో చేసిన ఫైట్ చాలా కష్టపడి చేశాం. త్వరలోనే ఈ పైట్‌ని ప్రేక్షకులకు చూపించాలని హీరో మంచ్ మనోజ్ తెలిపారు.
మంచు మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. అల్లరి నరేష్‌తో సీమశాస్త్తి, మంచు మనోజ్‌తో దేనికైనా రెడీ చిత్రాలను తీసిన జి. నాగేశ్వర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ప్రత్యేక పాత్రలో నటించింది. టాలీవుడ్‌లో సన్నీ లియోన్ నటించిన మొదటి చిత్రం ఇది. సన్నీ లియోన్ నటించిన ప్రత్యేక గీతం ఈ సినిమాకి అదనపు ఆకర్షణ. గీతాంజలి తాస్య ఈ సినిమాలో ముఖ్య భూమికను పోషిస్తున్నారు. వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తోన్న ఈ సినిమాని మంచు విష్ణు నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ఆడియో రిలీజ్ తేదీని ప్రకటించనున్నారు.