English | Telugu

చిరంజీవి ప్లాప్..నిజాలు చెప్పిన కైకాల సోదరుడు

పోకిరి లో మహేష్ బాబు (mahesh babu)చెప్పిన "ఎప్పుడొచ్చామని కాదన్నాయ్, బుల్లెట్ దిగింది లేదా అనే డైలాగ్ కి తగ్గట్టుగా మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)కి సంబంధించిన న్యూస్ ఒకటి ఎప్పుడొచ్చామన్నది కాదు, వైరల్ అయ్యామా లేదా అని చెప్తుంది.ఇంతకీ ఆ న్యూస్ ఏంటో చూద్దాం.

లేటెస్ట్ గా విశ్వ విఖ్యాత నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ సోదరుడు కైకాల నాగేశ్వరరావు(kaikala nageswara rao)రమ ఫిలింస్ పైనే కాకుండా ఇతరుల భాగస్వామ్యం లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్,శోభన్ బాబు,చిరంజీవి, బాలకృష్ణ లతో పలు సినిమాలని నిర్మించారు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు చిరంజీవి హీరోగా చిరంజీవి అనే సినిమాని నిర్మించాం. నిజానికి చిరంజీవి గారితో ప్లాన్ చెయ్యలేదు. చిరంజీవి మూవీకి ఒరిజినల్ వెర్షన్ కన్నడంలో వచ్చిన నానే రాజా.. కొత్త హీరో తో ఐతే బాగుంటుందని అనుకోని అందుకు తగ్గ ప్రయత్నాల్లో ఉన్నాం. హీరో తప్పుల మీద తప్పు చేసి చనిపోతాడు. తప్పని పరిస్థితుల్లో తప్పులు చేసి చనిపోతాడు కొద్దిగా నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయి.అందుకనే కొత్త హీరో ని ఫిక్స్ అయ్యాం. కానీ చిరంజీవి పట్టు బట్టి చేసాడు. మీరు నెగిటివ్ రోల్ కి సెట్ అవ్వరు. హీరోగా మంచి ఎస్టాబ్లిష్ అవుతున్నారని కూడా చెప్పం. కానీ చిరు వినలేదు. ఆ పాత్ర మీద ఇష్టంతో చేసారు. కానీ సినిమా ప్లాప్ అయ్యింది. ఈ విషయం చిరంజీవి గారికి కూడా తెలుసనీ చెప్పుకొచ్చాడు.

ఇక ఆయన చెప్పినట్టుగానే 1985 ఏప్రిల్ 18 విడుదలైన చిరంజీవి మూవీ పరాజయాన్ని మూటగట్టుకుంది. చిరు సరసన విజయశాంతి జత గట్టగా భానుప్రియ, మురళి మోహన్, సత్యనారాయణ,రంగనాధ్ తదితరులు ముఖ్య పాత్రల్లో చేసారు.సి వి రాజేందరన్ దర్శకుడు.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.