English | Telugu

Viraaji OTT : ఓటీటీలో అదరగొడుతున్న వరుణ్ సందేశ్ విరాజి!

హ్యపీ డేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడయ్యాడు హీరో వరుణ్ సందేశ్. ఆ తర్వాత కొత్త బంగారు లోకం లాంటి కాలేజీ బ్యాక్ డ్రాప్ కథలని చేస్తూ యూత్ కి దగ్గరయ్యాడు. ఇక అప్పటి నుండి బోలెడు సినిమాలు చేశాడు. కానీ ఏవీ అంతగా హిట్ పొందలేకపోయాయి.

అయితే ఈ మధ్యకాలంలో వరుణ్ సందేశ్ థ్రిల్లర్ మూవీల మీద పడ్డాడు. ఈ ఏడాది నింద అనే హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో నటించిన వరుణ్ సందేశ్.. పెద్దగా హిట్ పొందలేకపోయాడు. ఇక అదే తరహాలో తాజాగా 'విరాజి' అనే మూవీ చేశాడు. అధ్యంత్ హర్ష దర్శకుడిగా చేసిన ఈ మూవీ అగస్ట్ 2 న థియేటర్లలో రిలీజైంది. అయితే తాజాగా ప్రముఖ ఓటీటీ వేదిక 'ఆహా' లో ఈ మూవీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది‌. అయితే ఓటీటీ వేదికలపై థ్రిల్లర్ సినిమాలకి క్రేజ్ ఎక్కువే. ఎందుకంటే స్కిప్ చేస్తూ చూసే వెసలుబాటు ఉంది కాబట్టి ల్యాగ్ ఎక్కువ అనిపిస్తే, సాంగ్స్ వచ్చినప్పుడు స్కిప్ చేసేయోచ్చు. అయితే ఇప్పుడు విరాజి ఓటీటీ ప్రేక్షకులని చేరింది.

విరాజి మూవీలో రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరాం కీలక పాత్రలు పోషించారు. హారర్, థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో అదరగొడుతుంది. అసలు ఏం ఉందో చూసేద్దాం. ఓ పాతబడిన బంగ్లాకి కొంతంది వస్తారు. డాక్టర్, ఫోటోగ్రాఫర్, సినీ నిర్మాత, స్టాండప్ కమెడియన్, పోలీసు అధికారి, ప్రముఖ జ్యోతిష్కుడు ఇలా ఒకరితో ఒకరికి పరిచయం లేని వాళ్ళంతా అక్కడికి వస్తారు. వారంతా కలిసి ఎవరికోసమో ఎదురుచూస్తుంటారు. అయితే తమకు అదే చివరి రోజు అని ఓ కార్డుపై రాసి పెట్టి ఉంటుంది. అది చూసి అక్కడికి వచ్చినవాళ్ళంతా భయంతో ఉంటారు. కాసేపటికి అక్కడికి మత్తులో ఉన్న ఆండ్రీ(వరుణ్ సందేశ్) వస్తాడు. ఆండ్రీ వచ్చాక అక్కడ ఏం జరిగింది? అసలు వారందరు అక్కడికి ఎందుకు వచ్చారు? ఆ బిల్డింగ్ లో ఉంది దెయ్యామా లేక మనిషా తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. 'ఆహా' లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ థ్రిల్లర్ మూవీని ఓసారి చూసేయ్యండి.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.