English | Telugu
కేజీయఫ్3 - ఇంట్రస్టింగ్ పాయింట్స్
Updated : Jan 10, 2023
కేజీయఫ్ గురించి చింతాకు అంత న్యూస్ లీక్ అయినా అలర్ట్ గా ఓ చెవి వేసి ఉంటున్నారు ఫ్యాన్స్. అంతగా జనాలను కట్టిపడేసిన సబ్జెక్ట్ కేజీయఫ్. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరక్షన్‌లో తెరకెక్కింది కేజీయఫ్. ఈ పార్ట్ ని మించేలా కలెక్షన్లు రాబట్టింది సీక్వెల్. ఇప్పుడు కేజీయఫ్ త్రీక్వెల్ కోసం హోంబలే సంస్థ రెడీ అవుతోంది. 2025లో త్రీక్వెల్‌ను సెట్స్ మీదకు తీసుకెళ్లాలన్నది ప్లానింగ్ అట.మొత్తం బంగారంతో సెకండ్ పార్ట్ లో సముద్రంలోకి చేరుకున్న రాకీభాయ్ థర్డ్ పార్ట్ లో ప్రపంచాన్ని ఏలడానికి ప్రయత్నిస్తాడట. ఆ లావిష్ నెస్‌ని కన్వే చేయడానికి ఈ ప్రాజెక్ట్ ని వెయ్యి కోట్లతో తెరకెక్కించడానికి సిద్ధమవుతోంది హోంబలే సంస్థ. 2025 జూన్‌లోగానీ, సెప్టెంబర్‌లోగానీ ట్రైలర్ కూడా ముందుగానే విడుదల చేస్తారట. థర్డ్ పార్ట్ ని ఎలా డీల్ చేస్తారనే విషయాన్ని ఆ ట్రైలర్‌లో చెప్పబోతున్నారట.
థర్డ్ పార్ట్ లో కమల్‌హాసన్ కీలక పాత్రలో కనిపిస్తారనే వార్తలున్నాయి. నార్త్ నుంచి హృతిక్ రోషన్ గెస్ట్ రోల్లో కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నది శాండల్‌వుడ్‌లో వినిపిస్తున్న మాట. తెలుగు నుంచి రానాని కూడా థర్డ్ పార్ట్ కోసం అప్రోచ్ అయ్యారనే మాటలున్నాయి. రవీనా టాండన్, మాళవిక రావు, రావు రమేష్‌తో పాటు మరికొందరు థర్డ్ పార్ట్ లో కనిపిస్తారు. ప్రస్తుతం ప్రభాస్‌తో తెరకెక్కిస్తున్న సలార్‌తో బిజీగా ఉన్నారు డైరక్టర్ ప్రశాంత్ నీల్. యష్19 మూవీతో యష్ కూడా బిజీ కాబోతున్నారు. అటు హోంబలే సంస్థ ప్రెస్టీజియస్ సినిమాల నిర్మాణంలో తలమునకలై ఉన్నారు. ఇన్నిటినీ దాటుకుని కేజీయఫ్3ని పగడ్బంధీగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తోంది. ఇండియన్ టాప్ గ్రాసర్‌గా కేజీయఫ్3ని నిలబెట్టాలన్నదే ఇప్పుడు ఈ టీమ్ ఆశయమట.