English | Telugu

టెంప‌ర్ మ‌ళ్లీ లీక‌య్యిందోచ్‌

ఫక్ట్ లుక్ కంటే ముందే ఎన్టీఆర్ స్టిల్స్ బ‌య‌ట‌కు వ‌చ్చేశాయ్‌. ఇప్పుడు టీజ‌ర్ రాకుండానే క‌థ లీకైపోయింది. ఇంత‌కీ టెంప‌ర్ క‌థేంటంటే... ఎన్టీఆర్ ఓ అనాథ‌. చిన్న‌ప్పుడు తిండీ తిప్ప‌లు లేక అల్లాడిపోతాడు. ఓ అవినీతి పోలీస్ ఆఫీస‌ర్ ని చూసి ''నేనూ పోలీస్ అయితే అలానే డ‌బ్బులు సంపాదించొచ్చు క‌దా..'' అని డిసైడ్ అవుతాడు. అప్ప‌టి నుంచీ ఒక్క‌టే ల‌క్ష్యం.. పోలీస్ కావ‌డం. చివ‌ర‌కు పోలీస్ అవుతాడు. దొరికిందంతా దోచుకొంటాడు. వైజాగ్ దాదా అయిన ప్ర‌కాష్‌రాజ్‌తో బేరం పెట్టుకొంటాడు. దొంగ పోలీస్ లా కార్లు, బంగ‌ళాలూ సంపాదిస్తాడు. చివ‌రికి ''నేను చేస్తోంది త‌ప్పు..'' అనే సంగ‌తి తెలుస్తుంది. ఆ త‌ర‌వాత మార్పు వ‌స్తుంది. ఎవ‌రి అరాచ‌కాలకు అండ‌గా నిలిచాడో, వాళ్ల‌నే తుక్కు రేగ్గొట్ట‌డం స్టార్ట్ చేస్తాడు.. త‌న టెంప‌ర్ చూపిస్తాడు. అదీ టెంప‌ర్ క‌థ‌. ఇదంతా వింటుంటే ల‌క్ష్మీన‌ర‌సింహా గుర్తొస్తుంది క‌దూ. మ‌రి పూరికి మాత్రం ఈ బ‌ల్బ్ వెల‌గ‌లేదేమో..? క‌థ పాత‌దైనా పూరి జ‌గ‌న్నాథ్‌కి క‌థ‌నంతో మ్యాజిక్ చేసే ద‌మ్ముంది. ఆయ‌న కూడా దాన్నే న‌మ్ముకొన్నాడేమో. మ‌రి తెర‌పై 'ల‌క్ష్మీన‌ర‌సింహా 2' ఎంత హంగామా చేస్తుందో ఏంటో..??

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.