English | Telugu
డబ్బుల్లేవా.. బాహుబలీ..?!
Updated : Dec 8, 2014
టాలీవుడ్‌లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం బాహుబలి. ఈ సినిమా కోసం రెండేళ్ల నుంచీ ప్రభాస్ ఫ్యాన్స్ తీక్షణంగా ఎదురుచూస్తున్నారు. 2015 ఏప్రిల్‌లో బాహుబలి రాక ఖాయమైనా... పార్ట్ 2పై చాలా సందిగ్థత నెలకొంది. పార్ట్ 1 కీ పార్ట్ 2 కీ విరామం ఎంతిస్తారు?? పార్ట్ 2 కూడా 2014లోనే విడుదల చేస్తారా, లేదా? ఇలా ఎన్ని క్వశ్చన్లో. విశ్వసనీయ వర్గాల ప్రకారం తెలిసిన సమాచారం ఏమిటంటే.. బాహుబలి టీమ్ దగ్గర డబ్బుల్లేవట. ఇప్పటికే రూ.100 కోట్లకుపైనే బడ్జెట్ తేలడంతో... నిధులు లేక షూటింగ్ ఆపేద్దామన్న ఆలోచనకు వచ్చారట. బాహుబలి 1 పై దృష్టి పెట్టి, ఆ సినిమా విడుదల చేసి, ఆ తరవాత వచ్చిన డబ్బులతో బాహుబలి 2 పూర్తి చేద్దామనుకొంటున్నారట. టెక్నికల్ గా 1 ఎప్పుడో పూర్తయింది. మరో 20 % షూటింగ్ చేస్తే పార్ట్ 2 కూడా రెడీ అవుతుంది. అయితే నిర్మాణానంతర కార్యక్రమాలకు భారీ ఎత్తున ఖర్చు పెట్టాల్సివస్తోంది. గ్రాఫిక్స్ కోసమే రూ.40 కోట్లకు పైనే అవుతుందట. అందుకే పార్ట్ 2 పక్కన పెట్టేసి, ముందు పార్ట్ 1 సంగతి తేల్చేద్దామన్న ఆలోచన చేస్తున్నారు. బాహుబలి విడుదలైన రెండు నెలలలోపే పార్ట్ 2 కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. రాజమౌళి సినిమాలకే బడ్జెట్ లేదంటే.. మరి మిగిలినవాటి గురించి ఏం చెప్తాం..?