English | Telugu

జో మూవీ రివ్యూ

మూవీ : జో
నటీనటులు : రియో రాజ్, మాలవిక మనోజ్, భవ్య త్రిక
సినిమాటోగ్రఫీ: రాహుల్ కెజి విజ్ఞేష్
మ్యూజిక్: సిద్దు కుమార్
ఎడిటింగ్: వరుణ్ కెజి
నిర్మాతలు: డా. అరులానందు, మాథ్యు అరులానందు
రచన, దర్శకత్వం: హరిహరన్ రామ్ ఎస్
ఓటీటీ : డిస్నీ ప్లస్ హాట్ స్టార్

ఇతర భాషల్లో విడుదలైన సినిమాలు ఓటీటీ వేదికపై తెలుగులో అందుబాటులో ఉంటున్నాయి. అందులో కొన్ని చిన్న సినిమాలు మంచి కంటెంట్ ఇస్తుంటే మరికొన్ని సాధారణంగా ఉంటున్నాయి. మరి తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైన ' జో ' మూవీ కథేంటో ఓసారి చూసేద్దాం...

కథ :

తమిళనాడులోని ఓ కాలేజీలో ముగ్గురు స్టూడెంట్స్ మంచి స్నేహితులుగా ఉండేవారు. జో(రియో రాజ్), సాంతా, ప్రవీణ్ కలిసి కాలేజీలో అల్లరి చిల్లరగా తిరిగేవాళ్ళు.. ఓరోజు కాలేజీలో సుచిత్ర(మాలవిక మనోజ్) ని జో(రియో రాజ్) చూస్తాడు. ఇక ఫస్ట్ లుక్ లోనే తనని ఇష్టపడతాడు. తన ప్రేమలో కాలేజీ లైఫ్ సాగుతుంది. అయితే వారిమధ్య ప్రేమ ఎంతో కాలం నిలవదు. ఓరోజు జో, సుచీ మధ్య గొడవ జరుగుతుంది. అది కాస్త పెద్దవాళ్ళ మీద గొడవపడేంతలా మారుతుంది. ఇక ఓరోజు సుచీ అనుకోకుండా చనిపోతుంది. ఆ తర్వాత జో లైఫ్ లోకి భవ్య త్రిక(శృతి) వస్తుంది. మరి సుచీ ఎలా చనిపోయింది? జో లైఫ్ లోకి వచ్చిన శృతి ఏం చేసిందనేది మిగతా కథ...

విశ్లేషణ:

జో కాలేజీ లైఫ్ లో సాగిన ప్రేమకథలో జరిగిన సంఘటనలు, ఆ తర్వాత అతని పెళ్ళికి కలిగిన ఇబ్బందులు.. ఆ తరవాత అతని లైఫ్ ఎలా మారిందనే కథనంతో ఆసక్తిగా తీయడంలో హరిహరన్ రామ్ సక్సెస్ అయ్యాడు. అయితే కథలో వచ్చే కొన్ని సీన్లు నెమ్మదిగా సాగుతాయి. రెండు గంటల‌ ఇరవై అయిదు నిమిషాల నిడివి ఈ కథకి చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఇదే తరహా సినిమాలు ఇప్పటికే మనం చాలా సినిమాల్లో చూసాం కదా అనే ఫీలింగ్ ఫస్టాఫ్ ముగిసేవరకే తెలిసిపోతుంది. అయితే ఫస్టాఫ్ లో వచ్చే ట్విస్ట్ కాస్త ఆసక్తిని కలుగజేస్తుంది. అడల్ట్ సీన్స్ ఏమీ లేకపోయిన కథలో ట్విస్ట్ లు ఎక్కువగా లేకపోవడం కాస్త నిరాశని కలుగజేస్తాయి.

ద్వితీయార్థంలో ఆడియన్స్ ని ప్రభావితం చేసేవి ఏవీ లేకపోవడం పెద్ద మైనస్. 'రాజారాణి' సినిమాని కాలేజీ లైఫ్ లో గొడవలో చూస్తున్న ఫీల్ వచ్చేస్తుంది. పెద్దగా లేని కథని మరీ రెండున్నర గంటల ఓపికగా చూడటం కాస్త కష్టమే. డీప్ లవ్ ని చూపిద్దామనుకున్న డైరెక్టర్ హరిహరన్ రామ్ ఒకటి రెండు సీన్లు మాత్రమే చూపించాడు. ప్రథమార్ధంలో వచ్చే లవ్ ట్రాక్ బాగున్నప్పటికి దాని ఎండింగ్ అంతగా కనెక్ట్ కాలేకపోతుంది. జో ఫ్రెండ్స్ పాత్రలని ఇంకా బాగా వాడుకోవచ్చు కానీ ఆ కోణంలో దర్శకుడు ఆలోచించలేకపోయాడనిపిస్తుంది.

రాజారాణి సినిమా చూసి మోటివేట్ అయి తీసినట్టుగా అక్కడక్కడ ఆ ఛాయలు మనకు కనిపిస్తుంటాయి. అయితే ఈ సినిమాలో వచ్చే క్లైమాక్స్ మరీ పేలవంగా ఉంది. ఓ సినిమా కథలో ఉండాల్సిన బేసిక్ ట్విస్ట్ ఒక్కటి లేదు. నాలుగు పాటలున్నాయి. అవి ఎందుకున్నాయో అర్థం కాలేదు. అన్నిటికంటే పెద్ద మైనస్ ఏదైనా ఉందంటే హీరోయిన్ కి తెలుగు డబ్బింగ్ లేకపోవడం.. కొన్ని సీన్లలో తమిళ్ భాష అలానే వస్తుంటుంది. అది కథని చాలా ఇబ్బంది పెడుతుంది. రాహుల్ కెజి విజ్ఞేష్ సినిమాటోగ్రఫీ బాగుంది. సిద్దు కుమార్ మ్యూజిక్ పర్లేదు. వరుణ్ కెజి ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు :

జో పాత్రలో రియో రాజ్ ఆకట్టుకున్నాడు. సుచిత్ర పాత్రలో మాలవిక మనోజ్, శృతి పాత్రలో భవ్య త్రిక సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. సెక్యూరిటీ గార్డ్ పాత్రలో ఛార్లీ ఆకట్టుకున్నాడు. ఇక మిగిలిన వారు తమ పాత్రలకి న్యాయం చేశారు.

తెలుగువన్ పర్ స్పెక్టివ్:

ప్రేమ కథలని ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. కామన్ ఆడియన్స్ కి అంతగా నచ్చకపోవచ్చు.

రేటింగ్: 2 / 5

✍️. దాసరి మల్లేశ్

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .