English | Telugu

రాజమౌళిని టార్గెట్‌ చేస్తూ.. ప్రమోషన్స్‌పై ధ్వజమెత్తిన ఆర్జీవీ!

సాధారణంగా ఏ సినిమా అయినా ప్రారంభం అయినప్పటి నుంచి దానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఆడియన్స్‌కి చేరవేస్తుంటుంది చిత్ర యూనిట్‌. అలాగే సినిమా పూర్తయిన తర్వాత రిలీజ్‌కి దగ్గర పడుతున్న సమయంలో తమ సినిమా ప్రజల్లోకి వెళ్లాలన్న ఉద్దేశంతో వివిధ రకరకాలుగా ప్రమోషన్స్‌ చేస్తుంటారు. అందులో భాగంగానే ఆడియో రిలీజ్‌ అనీ, ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ అనీ, చిత్ర యూనిట్‌ ఇంటర్వ్యూలనీ.. ఇలా ఎంత వీలైతే అంత తమ సినిమా గురించి హైప్‌ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో తమ సినిమా గురించి కాస్త అతిగానే చెప్పడం మనం చూస్తుంటాం. ఈ తంతుపై రామ్‌గోపాల్‌వర్మ స్పందిస్తూ ప్రమోషన్ల గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవేమిటో చూద్దాం.

‘సినిమా రిలీజ్‌ అయ్యే ముందు దానికి సంబంధించిన ప్రమోషన్స్‌ మనం చూస్తుంటాం. రకరకాల ఫంక్షన్స్‌లో ఆ సినిమాకి సంబంధింనిన హీరో, డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌.. ఇతర టెక్నీషియన్స్‌ రెచ్చిపోయి మాట్లాడుతుంటారు. ఈ సంక్రాంతి మాదే అని ఒకడంటాడు, బ్లాక్‌బస్టర్‌ కొట్టేస్తాం అని ఒకడంటాడు. మా సినిమా కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్‌ చేసే సినిమా అని ఒకడంటాడు. ఈసారి కొట్టేస్తున్నాం అని ఒకడంటాడు. బాక్సాఫీస్‌ను బద్దలు చేసేస్తుందని ఒకడంటాడు. ఇలాంటి మాటలు మనం వింటూనే ఉంటాం. ఆ సినిమా హిట్‌ అవుతుందో, ఫ్లాప్‌ అవుతుందో మనకు తెలీదు, వాళ్ళకి కూడా తెలీదు. కానీ, జనంలోకి ఇలాంటి మాటలు పంపిస్తుంటారు. టాలీవుడ్‌లో అలాంటి మాటలు మాట్లాడని ఒకే ఒక డైరెక్టర్‌ రాజమౌళి. ఇప్పటివరకు అతని కెరీర్‌లో ఒక్క ఫ్లాప్‌ కూడా లేదు. నాకు తెలిసి ఒక్క ఫ్లాప్‌ కూడా లేని డైరెక్టర్‌ రాజమౌళి మాత్రమే. అందులో డౌట్‌ లేదు. తన సినిమాకి కూడా ప్రమోషన్స్‌ చేస్తాడు. కానీ, ఏ ఒక్క ఫంక్షన్‌లోనూ తను చేసిన సినిమా బ్లాక్‌బస్టర్‌ అవుతుందని, బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టేస్తుందని చెప్పిన సందర్భాలు లేవు నాకు తెలిసి. అంటే మనం చెప్పినా చెప్పకపోయినా సినిమాలో విషయం ఉంటే అదే సక్సెస్‌ అవుతుంది. ఆ విషయం రాజమౌళికి తెలుసు. అందుకే అలాంటి మాటలు ఆయన్నుంచి రావు’ అన్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .