English | Telugu

బీ రెడీ.. ‘సలార్‌’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..?

భారీ అంచనాల మధ్య విడుదలైన ‘సలార్‌’ భారీ కలెక్షన్లు సాధించి వరల్డ్‌వైడ్‌గా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ఫ్యాన్స్‌ను ఎంతో ఖుష్‌ చేసింది. తమ హీరోని ఎలా చూడాలని అభిమానులు కోరుకున్నారో ఆ రేంజ్‌లో ప్రభాస్‌ని ప్రజెంట్‌ చేసి వారి చేత శభాష్‌ అనిపించుకున్నాడు ప్రశాంత్‌. వరల్డ్‌వైడ్‌గా దాదాపు రూ.700 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసి సంచలనం సృష్టించింది ‘సలార్‌’. ఈ సినిమాకి సంబంధించి థియేటర్లలో సందడి ముగిసింది. ఇక ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమ్‌ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ‘సలార్‌’ ఓటీటీ డేట్‌ ఫిక్స్‌ అయ్యిందంటూ వార్తలు వస్తున్నాయి.

‘సలార్‌’ డిజిటల్‌ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా స్ట్రీమింగ్‌కి సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేసింది నెట్‌ఫ్లిక్స్‌. త్వరలోనే తెలుగు, తమిళ్‌, మలయాళ భాషల్లో ‘సలార్‌’ స్ట్రీమింగ్‌ జరుగుతుందని ఆ పోస్టర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న అగ్రిమెంట్‌ ప్రకారం సినిమా రిలీజ్‌ అయిన 45 రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 9న ఓటీటీలోకి వస్తుందని తెలుస్తోంది. ఈ డేట్‌ మిస్‌ అయితే 16 తారీఖున స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. స్ట్రీమింగ్‌కి సంబంధించి త్వరలోనే అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.