English | Telugu

'సైంధవ్' సంక్రాంతికి రావడం కరెక్టేనా.. వెంకీ మామ రిస్క్ చేస్తున్నాడా?

సంక్రాంతి సీజన్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ని చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే మేకర్స్ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేస్తే, ఎక్కువగా సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తారు. అయితే తన కెరీర్ లో ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో ఘన విజయాలను సొంతం చేసుకున్న విక్టరీ వెంకటేష్.. వచ్చే సంక్రాంతికి మాత్రం యాక్షన్ సినిమాతో రిస్క్ చేస్తున్నారు.

వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్ లో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ 'సైంధవ్'. మొదట ఈ సినిమాని డిసెంబర్ 22న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఆ తేదీకి ప్రభాస్ 'సలార్' వస్తుండటంతో.. 'సైంధవ్' సంక్రాంతికి వాయిదా పడింది. ఈ మూవీ 2024, జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సంక్రాంతి బరిలో 'గుంటూరు కారం', 'VD13'(ఫ్యామిలీ స్టార్), 'హనుమాన్', 'ఈగల్', 'నా సామి రంగ' వంటి సినిమాలు ఉన్నాయి. ఈ లిస్టులో 'సైంధవ్' కూడా చేరింది. అయితే ఈ సినిమా సంక్రాంతికి వస్తే ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారు అన్నదే అనుమానం.

సంక్రాంతి పండుగ సమయంలో ప్రేక్షకులు ఎక్కువగా కుటుంబమంతా కలిసి ఆనందించదగ్గ సినిమాలు చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో 2024 సంక్రాంతికి ప్రేక్షకులు ఎక్కువగా 'గుంటూరు కారం', 'ఫ్యామిలీ స్టార్', 'హనుమాన్' వంటి సినిమాల వైపు మొగ్గు చూపే అవకాశముంది. అదే జరిగితే 'సైంధవ్'కి పరాభవం తప్పదు. నిజానికి 'సైంధవ్'పై మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా విడుదలైన టీజర్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే టీజర్ లో వయలెన్స్ ఎక్కువగా ఉంది. మిగతా సమయంలో ఏమో కానీ.. ఫ్యామిలీ సినిమాలను చూడటానికి ఇష్టపడే సంక్రాంతి సీజన్ లో ఇలాంటి యాక్షన్ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారా అనే అనుమానం ఉంది. మరి 'సైంధవ్'తో సక్సెస్ కొట్టి వెంకీ మామ ఈ అనుమానాలను పటాపంచలు చేస్తాడేమో చూడాలి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.