English | Telugu
డైలాగ్ కింగ్ తాతయ్య అయ్యాడు
Updated : Dec 18, 2015
హీరో ఆది గతేడాది రాజమండ్రికి చెందిన అరుణ అనే యువతిని వివాహమాడిన విషయం తెలిసిందే. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించిన ఆది - అరుణల జంటకి పండంటి ఆడ బిడ్డ పుట్టింది. గురువారం మధ్యాహ్నం అరుణ రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి - బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఆదికి కూతురు జన్మించడంతో సాయికుమార్ ఇంట్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. త్వరలోనే ఆది గరం సినిమాతో ప్రేక్షకుల ముందకు రాబోతున్నాడు. కూతురు పుడితే అదృష్టం తలుపు తట్టినట్టే అని నమ్ముతుంటారు చాలామంది. అలాగే డైలాగ్ కింగ్ సాయి కుమార్ తాతయ్య అయినందుకు చాలా ఆనందంగా వున్నారు.