English | Telugu

శ్రీరెడ్డి పాత్రలో తేజస్వి.. కంటెంట్ డిమాండ్ చేస్తే బోల్డ్ అయినా ఓకే!

రచన మీడియా వర్క్స్ సమర్పణలో ,ఎఫ్ 3 ప్రొడక్షన్స్ మరియు ఫుట్ లూస్ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'కమిట్ మెంట్'. ఇందులో తేజస్వి మదివాడ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన తేజస్వి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఈ సినిమాలో నాలుగు స్టోరీలు ఉన్నాయి. అందులో ఒకటి నా స్టోరీ. ఇందులో నా క్యారెక్టర్ సినిమా ఛాన్స్ అవకాశాల కోసం తిరిగే క్యారెక్టర్. నిజం చెప్పాలి అంటే శ్రీరెడ్డి గారి క్యారెక్టర్ కి దగ్గర గా ఉంటుంది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కి కూడా అదే నేమ్ పెట్టారు డైరెక్టర్. ఈ సినిమాలో స్టోరీ , ఇండస్ట్రీ లో జరిగే న్యాచురాలిటీ కి దగ్గర గా ఉంటుంది . అందుకే ఈ స్టోరీ వినగానే ఓకే చేశాను. సినిమా లో మంచి కంటెంట్ మరియు మెసేజ్ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ ని బద్నామ్ చేయద్దు అని చెప్పేదే ఈ సినిమా మెసేజ్. ఈ సినిమా రీయాలిటీ దగ్గర గా ఉంటుంది. ఈ సినిమా ద్వారా నాకు మంచి పేరు వస్తుంది అనుకుంటున్నాను.. మంచి స్కోప్ ఉన్న సినిమా.

ఈ సినిమా ఇండస్ట్రీ నాకు ఒక ఫుడ్ పెట్టింది. నాకు ఒక దారి చూపించింది. ఈ రోజు మీ ముందు ఉన్నాను అంటే సినిమా ఇండస్ర్టీ కారణం. కానీ ప్రతి దాంట్లో గుడ్, బ్యాడ్ ఉంటుంది. నేను జర్నలిజం చేశాను సస్టైన్ అవ్వకనే నేను ఫిలిం ఇండస్ట్రీ కి వచ్చాను. ఇండస్ట్రీ లో కి ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు వస్తున్నారు. మెంటల్ గా నేను స్ట్రాంగ్. కంటెంట్ నచ్చితే అడల్ట్ అయినా ఏది అయినా చేస్తాను. రియల్ లైఫ్ లో నాకు జరిగిన సంఘటనలు ఉంటాయి. మూవీ లో RGV గారి బిట్ ఉంటుంది చూడండి నా లైఫ్ లో అలాగే జరిగింది.

సినిమా కి ఎంత అవసరం అంత చేయాలి. నాకు బోల్డ్ అయినా కిస్ సీన్ అయినా కంటెంట్ డిమాండ్ చేస్తే తప్పకుండా చేస్తాను. నా పర్సనాలిటీ కి గుర్తింపు వచ్చింది కానీ నా నటనకి రాలేదు ఈ సినిమాతో వస్తుంది అని అనుకుంటున్నాను. ఈ సినిమాతో నాకు మంచి బ్రేక్ వస్తుంది అనుకుంటున్నాను.

బిగ్ బాస్ లో కి వెళితే కెరీర్ స్పాయిల్ అవుతుందని కొందరు అంటారు. కానీ నాకు అలాంటి ప్రాబ్లెమ్ ఏమి లేదు. కార్ కొన్నాను, ఇల్లు కొన్నాను. బిగ్ బాస్ కి వెళ్ళటం వలన నేను చాలా హ్యాపీ.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.