English | Telugu

పవన్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన సంధ్య థియేటర్.. పుష్ప 2 గుర్తుందిగా 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'హరిహరవీరమల్లు'(Hari Hara Veera Mallu)రిలీజ్ కి కౌంట్ డౌన్ మొదలయ్యింది. ఈ నెల 24 న పాన్ ఇండియా లెవల్లో అత్యధిక థియేటర్స్ లో వీరమల్లు విడుదల కానుంది. ఈ మూవీ ద్వారా పవన్ ఫస్ట్ టైం చారిత్రాత్మక జోనర్ ని టచ్ చేస్తున్నాడు. పవన్ సరసన నిధి అగర్వాల్(Nidhi Agerwal)జత కట్టగా బాబీ డియోల్, నర్గిస్ ఫక్రి, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రలు పోషించారు. జ్యోతికృష్ణ(Jyothi Krishna)దర్శకత్వంలో ఎఏం రత్నం(Am Rathnam)భారీ బడ్జెట్ తో నిర్మించగా కీరవాణి సంగీతాన్ని అందించాడు.

వీరమల్లు ట్రైలర్ ఈ రోజు విడుదల కానుంది. పవన్ అభిమానుల సమక్షంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్స్ లో ట్రైలర్ రిలీజ్ కి మేకర్స్ ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో కూడా ట్రైలర్ ఉంటుందని అనౌన్స్ చేసారు. దీంతో నిన్న అభిమానులు పాస్‌లు కోసం సంధ్య థియేటర్ కి భారీ ఎత్తున వచ్చారు. థియేటర్ యాజమాన్యం అభిమాన జనసందోహాన్ని అదుపుచేయలేకపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి రద్దీని నియంత్రించాల్సి వచ్చింది. దీంతో ట్రైలర్ రిలీజ్ కి రద్దీ మరింత పెరుగుతుందని ఉహించి ట్రైలర్ రిలీజ్ ని తమ థియేటర్ లో క్యాన్సిల్ చేస్తున్నట్టు సంధ్య థియేటర్ యాజమాన్యం ప్రకటించింది.

ఈ మేరకు థియేటర్ కి బోర్డు కూడా పెట్టారు. గత సంవత్సరం డిసెంబర్ 4 న పుష్ప 2(Pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిన విషయం తెలిసిందే. మళ్ళీ అలాంటి సంఘటనలు జరగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది.