English | Telugu

శ్రీహరి చేసిన భారీ సాయం బయటపడింది 

క్రాక్, వీరసింహారెడ్డి, జాట్ వంటి వరుస హ్యాట్రిక్ చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు గోపీచంద్ మలినేని(Gopichand malineni). తన తదుపరి చిత్రాన్ని గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణతో(Balakrishna)చెయ్యబోతున్నాడు. జూన్ 10 న బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ మూవీపై అధికార ప్రకటన రానుందనే వార్తలు సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.

రీసెంట్ గా గోపీచంద్ ఒక ఇంటర్వ్యూ లో తన సినీ జర్నీకి సంబంధించిన పలు విషయాలని ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతు కెమెరా అసిస్టెంట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కెమెరా లైట్లు మోసాను. ఆ తర్వాత ఏఏ ఆర్ట్స్ అధినేత మహేంద్రగారు 'శ్రీహరి'(Srihari)గారితో 'పోలీస్' అనే సినిమాని ప్లాన్ చేసారు. కెమెరా అసిస్టెంట్ గా చేయడానికి సిద్ధమయ్యాను. కథకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నప్పుడు, అందులోని కొన్ని విషయాల గురించి నేను మాట్లాడాను. దాంతో నన్ను మహేంద్ర గారు అసిస్టెంట్ డైరెక్టర్ గా చెయ్యమన్నారు. ఆ విధంగా పోలీస్ దగ్గర్నుంచి శ్రీహరి గారు కంటిన్యూగా చేసిన దేవా, సాంబయ్య, గణపతి, శివాజీ, ఇలా ఎనిమిది సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను. గోపీచంద్ ని పెట్టుకోమని ఆయనే ప్రొడ్యూసర్, డైరెక్టర్ లకి చెప్పేవాడు. ఈ విధంగా ఇండస్ట్రీలో ఫస్ట్ సపోర్ట్ శ్రీహరి గారి నుంచే వచ్చింది. ఎవరు లేకుండా ఎక్కడ్నుంచో వచ్చిన నాకు ఒక బ్రదర్ లాగా సపోర్ట్ చేశారు.

ఒక రోజు నీకిషమైన డైరెక్టర్ ఎవరని అడిగారు. ఈవివి సత్యనారాయణ(Evv Satyanarayana)అని చెప్పగానే ఈవివి గారికి ఫోన్ చేసి నన్ను అసిస్టెంట్ గా జాయిన్ చేసుకోమని చెప్పారు. ఆ విధంగా ఈవివి గారి దగ్గర రెండు సినిమాలకి చేశాను. ఆ తర్వాత శ్రీను వైట్ల, మురుగదాస్ వద్ద చేసి తర్వాత డైరెక్టర్ అయ్యానని చెప్పాడు. డాన్ శ్రీను, బాడీగార్డ్, విన్నర్, పండగ చేస్కో వంటి చిత్రాలు కూడా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన విషయం తెలిసిందే.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...