English | Telugu

మోహన్ లాల్ రేర్ ఫీట్.. ఒకే నెలలో ఇండస్ట్రీ హిట్, బ్లాక్ బస్టర్!

నెల రోజుల వ్యవధిలో ఒక ఇండస్ట్రీ హిట్ ని, ఒక బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకోవడం సాధారణ విషయం కాదు. అందునా ఒక సీనియర్ హీరో ఈ ఫీట్ ని సాధించడం అనేది నిజంగా గొప్ప విషయం. తాజాగా మలయాళ స్టార్ మోహన్ లాల్ (Mohanlal) అలాంటి ఫీట్ నే సాధించారు.

'లూసిఫర్'కి సీక్వెల్ గా మోహన్ లాల్ నటించిన 'ఎల్2: ఎంపురాన్' ఈ ఏడాది మార్చి 27న విడుదలైంది. వరల్డ్ వైడ్ గా రూ.260 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ మూవీ మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 'లూసిఫర్-2' విడుదలైన నాలుగు వారాలకు అంటే ఏప్రిల్ 25న 'తుడరుమ్‌'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మోహన్ లాల్. ఈ చిత్రం కూడా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఫుల్ రన్ లో రూ.150 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టే అవకాశం కనిపిస్తోంది. (Thudarum)

'తుడరుమ్‌'కి తరుణ్ మూర్తి దర్శకుడు. ఈ క్రైమ్ థ్రిల్లర్ రాజపుత్ర విజువల్ మీడియా బ్యానర్‌ లో రూపొందింది. 'లూసిఫర్-2' తర్వాత పెద్దగా హడావుడి థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సినిమా.. సంచలన వసూళ్లతో సర్ ప్రైజ్ చేస్తోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.