English | Telugu
మంచు పర్వతాల మధ్య గోపిచంద్ బస..పుట్టిన రోజు అంటే ఆ మాత్రం ఉండాలి
Updated : Jun 12, 2025
రెండు దశాబ్దాలపై నుంచి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉంటూ, విభిన్న క్యారెక్టర్స్ తో ప్రేక్షకుల్లో తన కంటు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరో గోపిచంద్(Gopichand). యజ్ఞం, లౌక్యం, రణం, శౌర్యం, శంఖం, వాంటెడ్, జిల్, సిటీ మార్, పక్కా కమర్షియల్, భీమా, విశ్వం వంటి పలు హిట్ చిత్రాలు గోపీచంద్ ఖాతాలో ఉన్నాయి.
ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి(sankalp Reddy)దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నాడు. గోపీచంద్ తన కెరీర్ లో చేస్తున్న ఈ ముప్పై మూడవ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాస్ చిట్టూరి(Srinivas Chitturi)నిర్మిస్తున్నాడు. ఈ రోజు గోపిచంద్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మూవీకి సంబంధించిన గ్లింప్స్ ని రిలీజ్ చేసింది. అతడొక యోధుడు విప్లవాన్ని రగిలించడానికి సిద్ధంగా ఉన్నాడు అనే క్యాప్షన్ తో రిలీజ్ చేసిన వీడియోలో 'మంచు పర్వతాల మధ్య బస చెయ్యడానికి ఏర్పాటు చేసుకున్న 'గుడారంలో నుంచి గోపి చంద్ బయటకి వచ్చాడు. అనంతరం అక్కడే ఉన్న అశ్వానికి(గుర్రం) తనలో ఉన్న బాధని చెప్పుకుంటున్నట్టుగా తల ఆనించాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో అత్యధిక వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది.
ఇక ఈ గ్లింప్స్ తో మూవీపై అభిమానులతో పాటు సినీ ప్రేమికుల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. కథపై కూడా అందరిలో ఆసక్తి పెరిగింది. ఈ చిత్ర దర్శకుడు సంకల్ప్ రెడ్డి గతంలో ఘాజీ, అంతరిక్షం,ఐ బి 71 అనే సినిమాలని తెరకెక్కించిన విషయం తెలిసిందే.