English | Telugu
కల్పిక పై కేసు నమోదు చేసిన పోలీసులు..రంగంలోకి బిఎన్ఎస్
Updated : Jun 12, 2025
అల్లు అర్జున్(Allu Arjun)త్రివిక్రమ్(Trivikram)కాంబోలో వచ్చిన 'జులాయి' మూవీలో రాజేంద్రప్రసాద్ కూతురుగా నటించి ప్రేక్షకులని ఆకట్టుకున్న నటి కల్పిక(Kalpika). అనేక చిత్రాల్లో హీరోయిన్ ఫ్రెండ్ తో పాటు, సైడ్ క్యారక్టర్ లని పోషించి తన కంటు ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది.
కల్పిక గత నెల 29న హైదరాబాద్(Hyderabad)లోని 'ప్రిజం పబ్'(Prism Pub)కి వెళ్ళింది. అనంతరం బిల్ పే చేయకుండా, ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, బూతులు తిట్టడం లాంటివి చేసి, అమర్యాదకంగా ప్రవర్థించింది. దీంతో 'ప్రిజం' సిబ్బంది పోలీసులకి ఫిర్యాదు చెయ్యడంతో వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత పోలీసుల సమక్షంలోనే కల్పిక నానా హంగామా సృష్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోను వైరల్ అయ్యింది.
ఈ మొత్తం విషయంలో పోలీసులు కోర్టు అనుమతితో కల్పిక పై సెక్షన్ 324(4),352,351(2) బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసింది. మరి ఈ విషయంలో కల్పిక ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.