English | Telugu
మెగా హీరో రాహుకేతు పూజలు
Updated : Nov 13, 2014
మెగా క్యాంప్ నుంచి ‘గౌరవం’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ కి టైమ్ అంతగా కలిసి రావడం లేదు. మొదటి సినిమాతో మెగా అభిమానులను ఆకట్టుకోలేకపోయిన అల్లు శిరీష్, రెండో సినిమా కొత్త జంటలో కూడా నిరాశపరిచాడు. ఆ సినిమాకు హీరో కంటే హీరోయిన్ కే ఎక్కువ పేరు వచ్చింది. అలాగే ఆ సినిమాలో శిరీష్ లేకుంటే మంచి ఫలితం వచ్చేదన్న విమర్శలు కూడా వచ్చాయి. దీంతో హిట్ కోసం దోష నివారణ పూజలో నిమగ్నమయ్యాడు మెగా హీరో. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం ఉదయం శిరీష్, తన ఫ్రెండ్‌తో కలిసి రాహుకేతు పూజలు నిర్వహించాడు. ఈ సందర్భంగా పూజ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న మీడియాపై ఈ హీరో అసహనం వ్యక్తంచేశాడని సమాచారం.