English | Telugu

గుణ‌శేఖ‌ర్‌... ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకొన్నాడా??

డూ ఆర్ డై సెట్యువేష‌న్‌లో గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కించిన సినిమా రుద్ర‌మ‌దేవి. ఈ సినిమాకి ముందు గుణ‌శేఖ‌ర్ కెరీర్ మ‌రీ ఘోరంగా ఉంది. సినిమా తీసేందుకు నిర్మాత కూడా లేడు. అలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో రుద్ర‌మ‌దేవి అనే స్ర్కిప్టుని న‌మ్మి దానిపై కోట్లు ధార‌బోశాడు. తీరా చూస్తే.. అది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా. క‌థానాయిక‌ని న‌మ్మి.. రూ.70 కోట్ల‌తో సినిమా తీసిన గుణ‌శేఖ‌ర్ సాహ‌సానికి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు.

అయితే.. రుద్ర‌మ‌దేవి మేకింగ్ అంత ఈజీగా ఏం జ‌ర‌గ‌లేదు. ప‌డుతూ లేస్తూ.. ఎన్నో క్లిష్ట ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటూ ఈ సినిమాని పూర్తి చేశాడు. ఈ సినిమా కోసం గుణ‌... త‌న ఇంటిని, త‌న ఆస్తుపాస్తుల్ని తాక‌ట్టు పెట్టాడ‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు చెప్పుకొంటున్నాయి. ఆఖ‌రికి ఆయ‌న కారు కూడా తాక‌ట్టులోనే ఉంద‌ని చెప్పుకొన్నాయి. ప‌లుమార్లు ఈ సినిమా విడుద‌ల తేదీ వాయిదా ప‌డ‌డంతో గుణ తీవ్ర‌మన‌స్థాపానికి గుర‌య్యాడ‌ని టాక్‌. అక్టోబ‌రు 9న ఈసినిమా విడుద‌లైంది. అయితే... అప్పుడు కూడా కొన్ని శ‌క్తులు ఈ సినిమాని ఆపాల‌ని ట్రై చేశాయ‌ట‌. నీ సినిమాని వాయిదా వేసుకో అని గుణ‌శేఖ‌ర్‌పై ఒత్తిడి తీసుకొచ్చాయ‌ట‌.

`ఈ ప‌రిస్థితుల్లో సినిమా ఆపితే ఆత్మ‌హత్య త‌ప్ప మ‌రో మార్గం లేద‌ని` గుణ వాళ్ల‌తో చెప్పుకొచ్చాడ‌ట‌. దాంతో.. గుణ‌పై ఒత్తిడి తీసుకొచ్చిన నిర్మాత‌లంతా వెన‌క్కి త‌గ్గి.. రుద్ర‌మ‌దేవి విడుద‌ల‌కు ఛాన్సిచ్చార‌ని తెలుస్తోంది. అయితే ఇప్ప‌టికీ గుణ‌శేఖ‌ర్ శేఖ‌ర్ సేఫ్ జోన్‌లో ప‌డ‌లేద‌ని చెప్పుకొంటున్నారు. ఇప్ప‌టికి కేవ‌లం రూ.30 కోట్లే రిట‌ర్న్ అయ్యాయ‌ని ఇంకా స‌గం డ‌బ్బులు రావాల్సివుంద‌ని టాక్‌. మ‌రి గుణ ఎప్పుడు ప్ర‌శాంతంగా ఊపిరి తీసుకొంటాడో మ‌రి.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.