English | Telugu

ప్రివ్యూ: రామ్ చరణ్ బ్రూస్లీ

రామ్‌చ‌ర‌ణ్ బ్రూస్లీగా వినోదాల విందు పంచ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. శ్రీ‌నువైట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ర‌కుల్‌ప్రీత్ సింగ్ క‌థానాయిక‌. ఈ శుక్ర‌వారం ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఫిల్మ్‌న‌గ‌ర్‌లో, అభిమానుల్లో ఈ సినిమాపై ఎలాంటి అంచ‌నాలున్నాయి? బ్రూస్లీ బ‌లాబ‌లాలేంటి? ఈ సినిమా స్టామినా ఎంత‌..?? ఓ లుక్కేద్దాం రండి.

* యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ల‌ను మ‌ల‌చ‌డంలో సిద్ద‌హ‌స్తుడు శ్రీ‌నువైట్ల‌. గ‌త సినిమా ఆగ‌డు ఫ్లాప్ అయినా... ఆయ‌న ట్రాక్‌రికార్డు బాగానే ఉంది. బ్రూస్లీ ట్రైల‌ర్ చూస్తే... ప్రేక్ష‌కుల‌కు కావ‌ల్సిన క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌న్నీ బాగానే ద‌ట్టించిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. ఈత‌ర‌హా చిత్రాలే ప్ర‌స్తుతం బాక్సాఫీసు వ‌సూళ్లు కొల్ల‌గొడుతున్న త‌రుణంలో బ్రూస్లీ కూడా బాక్సాఫీసును రంజింప చేసే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.

* ఇది ద‌స‌రా సీజ‌న్‌. సినిమా ఏమాత్రం బాగున్నా... వ‌సూళ్లు కుమ్ముకోవ‌చ్చు. మ‌రోవైపు రుద్ర‌మ‌దేవి కూడా సోమ‌వారం నుంచి కాస్త వీక్ అయ్యింది. ఆ బ‌ల‌హీన‌త‌ను కూడా బ్రూస్లీ క్యాష్ చేసుకొంటే ఇక తిరుగుండ‌క పోవ‌చ్చు.

* చ‌ర‌ణ్ సినిమాల్లో మ‌గ‌ధీర భారీ వ‌సూళ్ల‌ను సాధించింది. ఆ త‌ర‌వాత నాయ‌క్‌, ర‌చ్చ‌, ఎవ‌డు కూడా రూ.50 కోట్ల క్ల‌బ్‌లో చేరాయి. ఇప్పుడు చ‌ర‌ణ్ ల‌క్ష్యం రూ.100 కోట్ల‌ని తెలుస్తోంది. సినిమాకి ఏ మాత్రం పాజిటీవ్ బ‌జ్ వ‌చ్చినా... ఆ ల‌క్ష్యం చేరుకోవ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. దానికి తోడు విడుద‌ల‌కు ముందు రోజు భారీగా ప్రీమియ‌ర్లు ప్లాన్ చేస్తున్నారు. టికెట్టు రేటు దాదాపు రూ.1000 ల‌ని స‌మాచారం. ఇవ‌న్నీ క‌లుపుకొంటే.. బ్రూస్లీ వ‌సూళ్ల వ‌ర‌ద సృష్టించొచ్చు.

* శ్రీ‌నువైట్ల సినిమాల‌కు విదేశాల్లో మంచి గిరాకీ. ఓవ‌ర్సీస్‌లో ఆయ‌న సినిమాల్ని బాగా చూస్తారు. చ‌ర‌ణ్‌కీ అక్క‌డ బాగానే అభిమానులున్నారు. అదీ ఈ సినిమాకి క‌లిసొచ్చేలా ఉంది.

* శ్రీ‌నువైట్ల సినిమాలంటే దాదాపుగా మాస్ ఎంట‌ర్‌టైన‌ర్లే. ఈ సినిమాలో ఆయ‌న కుటుంబ‌బంధాల‌కూ చోటిచ్చారు. మ‌రీ ముఖ్యంగా బ్ర‌ద‌ర్ సిస్ట‌ర్ సెంటిమెంట్ పై ఆయ‌న ఫోక‌స్ పెట్టారు. అది ఏమాత్రం ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి ఎక్కినా... బ్రూస్లీకి ఇక తిరుగు ఉండ‌క‌పోవ‌చ్చు.

* అన్నిటికంటే ముఖ్యంగా ఏడేళ్ల సుదీర్ఘ విరామం త‌ర‌వాత చిరంజీవి తెర‌పై క‌నిపించ‌నున్నాడు. ఆయ‌న అభిమానులు ఇలాంటి క్ష‌ణాల కోస‌మే ఎదురుచూస్తున్నారు. చిరు కోస‌మైనా రిపీట్ ఆడియ‌న్స్ వ‌స్తార‌ని చిత్ర బృందం అంచ‌నాలు వేసుకొంది.

* ఇప్ప‌టికే ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ సూప‌ర్‌గా జ‌రిగిపోయింది. రూ.40 కోట్ల‌తో తెర‌కెక్కించిన ఈ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ రూ.50 కోట్ల బిజినెస్ పూర్తి చేసుకొంద‌ని స‌మాచారం. ఆ లెక్క‌న రూ.10 కోట్ల టేబుల్ ప్రాఫిట్‌లోనే ఉంద‌న్న‌మాట‌.

* ఇక మైన‌స్‌ల విష‌యానికొస్తే.. చ‌ర‌ణ్ గ‌త సినిమా గోవిందుడు అంద‌రివాడేలే యావ‌రేజ్ టాక్ తెచ్చుకొంది. శ్రీ‌నువైట్ల సినిమా ఆగ‌డు అయితే డిజాస్ట‌ర్‌. మ‌రి వీళ్లిద్ద‌రి నుంచి వ‌స్తున్న సినిమా కాబ‌ట్టి.. ప్రేక్ష‌కుల్లో, అభిమానుల్లో కొన్ని భ‌యాలు ఉండొచ్చు.

* శ్రీ‌నువైట్ల ఎప్పుడు ఎలాంటి సినిమా తీస్తాడో చెప్ప‌లేం. ఒక్క‌సారిగా ఆయ‌న ప్రేక్ష‌కుల్ని డిజ‌ప్పాయింట్ చేసిన సంద‌ర్భాలున్నాయి.

* ఈ సినిమాలో కామెడీ బాగా త‌గ్గింద‌ని, ఎక్కువ‌గా యాక్ష‌న్ అంశాల‌పైనే దృష్టిపెట్టార‌ని టాక్‌. శ్రీ‌నువైట్ల బ‌లం వినోదమే. అలాంటిది ఆయ‌న సినిమాలో కామెడీ త‌గ్గితే ఇంకేమైనా ఉందా?? జ‌నాలు ఎలా రిసీవ్ చేసుకొంటారో ఏంటో..??

మొత్తానికి కొన్ని మైన‌స్‌లు ఉన్నా.. బ్రూస్లీ కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మ‌రి ఈ సినిమా ఎలాంటి ఫ‌లితాన్ని రాబ‌ట్టుకొంటుదో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.