English | Telugu

వీడియో: ‘శంకరాభరణం’ టీజర్

‘మా నాన్న మిలియన్స్ మిలియన్స్ ఎర్న్ చేశారు. ఆయనా కష్టపడి నేనూ కష్టపడితే ఇంకెవర్రా సుఖపడేది’’ అంటాడు నిఖిల్. కట్ చేస్తే బిహీర్ లో ఓ బస్సు టాప్ మీద కూర్చుని జనాలతో కలిసి ట్రావెల్ చేస్తుంటాడతను. కార్లో వస్తే కిడ్నాప్ చేస్తారేమో అని భయంతో ఇలా బస్సులో ట్రావెలింగ్ అంటూ సప్తగిరి ఇచ్చే పంచ్.. తర్వాత బిహార్ గ్యాంగుల విశ్వరూపం చూపించారు. మొత్తానికి పవన్ కళ్యాన్ చేతుల మీదుగా విడుదలైన ‘శంకరాభరణం’ టీజర్ అంచనాలకు తగ్గట్లే ఫన్నీ ఫన్నీగా ఉంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.