English | Telugu
పవన్ సినిమా దక్కించుకున్న దిల్ రాజు
Updated : Dec 30, 2014
గోపాల గోపాల మార్కెట్ లో భారీ క్రేజ్ ను సొంతం చేసుకొంది. అత్తారింటికి దారేది తరువాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా కావడం, అలాగే వెంకటేష్, పవన్ నటిస్తున్న మల్టీస్టారర్ కావడంతో సినిమాపై అభిమానులలో భారీ అంచనాలే వున్నాయి. ఈ అంచనాలను క్యాష్ చేసుకోవాలని భావిస్తున్న డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా హక్కులను భారీ రెట్లు పెట్టి దక్కించుకుంటున్నారు. లేటెస్ట్ గా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం నిర్మాత దిల్ రాజు నైజాంను సొంతంచేసుకున్నాడట. నైజాం రైట్స్‌ని రూ 13.5 కోట్లకు ఆయన తీసుకున్నట్లు సమాచారం. పవన్ కల్యాణ్ కు నైజాంలో గట్టి పట్టే ఉన్నా ఇది మల్టీస్టారర్ సినిమా కావటం, అందులోనూ పవన్ పాత్ర తక్కువగా ఉండటంతో ఇంత పెద్ద మొత్తం పెట్టి సినిమా కొనాల్సిన అవసరం ఏముందని కొందరు ప్రశ్నిస్తున్నారు. పవన్ సినిమా హిట్టయితే ఓకే ..అదే బోల్తాపడితే ప్రమాదం తప్పదని ఇండస్ట్రీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.