English | Telugu
'బాలయ్య' హీరో ఆఫ్ ది ఇయర్
Updated : Dec 30, 2014
గత నలభై సంవత్సరాలుగా టాలీవుడ్ టాప్ స్టార్ లలో ఒకరిగా వుంటూ, ఇప్పటికి తన సినిమాలతో యంగ్ స్టార్ హీరోలకు పోటీనిస్తున్న వ్యక్తి నందమూరి బాలకృష్ణ. అభిమానులు ముద్దుగా నందమూరి నటసింహం అంటు౦టారు. ఈ నటసింహానికి ఈ ఏడాది బాగా కలిసివచ్చిందని చెప్పాలి. గత కొంతకాలంగా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన హిట్ లేని బాలయ్య, ఈ ఏడాది ‘లెజెండ్’ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద తన పవర్ ని మరోసారి చూపించాడు. ఈ సినిమా ఏకంగా 275 రోజుల ప్రదర్శన కూడా పూర్తిచేసుకుంది. రెండో వారంలోనే సినిమా ఆచూకీ గల్లంతయిపోతున్న రోజుల్లో...ఓ సినిమా 275 రోజుల ఆడింది అంటే అది బాలయ్యకే చెల్లింది. అలాగే ఈ సంవత్సరం ఆయనకు అదనంగా ఓ గుర్తింపు యాడ్ అయ్యింది. అదే బాలయ్య ఎమ్మెల్యే కూడా అయ్యాడు. రాజకీయాల్లోకి అడుగు పెట్టి, తొలి దఫాలోనే అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, తనదైన శైలిలో ముందుకు దూసుకువెళ్తూన్నారు. ఈ సంవత్సరంలాగే 2015లో కూడా సినీ రంగంలో, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసి అభిమానుల కోరికను తీర్చాలని కోరుకుందాం.