English | Telugu

‘ధూమమ్’ మూవీ రివ్యూ

మూవీ : ధూమమ్
నటీనటులు: ఫహాద్ ఫాజిల్,‌ వినీత్, అపర్ణ మురళి తదితరులు
ఎడిటింగ్: సురేశ్ అరుముగమ్
సినిమాటోగ్రఫీ: ప్రీత జయరామన్
మ్యూజిక్: పూర్ణచంద్ర తేజస్వి
నిర్మాతలు: విజయ్ కైరగండుర్
రచన, దర్శకత్వం: పవన్ కుమార్

ఒక భాషలో విడుదలై ఓటీటీ వేదికపై పలు భాషల్లో డబ్ అవుతున్న సినిమాలకి ఇప్పుడు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. ‌అలాంటిదే ధూమమ్.. మళయాళం లో థియేటర్లలో విడుదలై ఇప్పుడు ఓటీటీలో తెలుగులో అందుబాటులో ఉంది‌. ఫహాద్ ఫాజిల్, అపర్ణ మురళి, వినీత్ నటించిన ధూమమ్ కథేంటో ఒకసారి చూసేద్దాం...

కథ:

అవినాష్(ఫహాద్ ఫాజిల్), దియా(అపర్ణ బాలమురళి) భార్యభర్తలు. వీరిద్దరిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి ఒక గదిలో బంధిస్తారు. కాసేపటికి అవినాష్ కి సిధ్(రోషన్ మాథ్యూ) కాల్ చేస్తాడు. మీరు అక్కడే ఉండండి మీకు అదే సేఫ్ అని చెప్తాడు. అయితే అవినాష్ చేసిన తప్పుకి దియా కూడా తనతో శిక్ష అనుభవిస్తున్నట్టు చెప్పి, తనకి సారీ చెప్తాడు. అసలేమవుతుందో దియా తెలుసుకోవాలని అవినాష్ ని నిలదీస్తుంది‌. ఇందులో తను ఎలా ఇన్వాల్వ్ అయ్యాడో అన్నీ దియాకి చెప్తుంటాడు అవినాష్. అవినాష్ ఒక సిగరేట్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్ గా జాయిన్ అవుతాడు. అయితే వారి కంపెనీ సేల్స్ పెంచడానికి అవినాష్ ఒక కొత్త యాడ్ ని తీస్తాడు‌. అది సక్సెస్ కావడంతో అవినాష్ కి ప్రమోషన్ వస్తుంది. అయితే అతనికి ప్రమోషన్ వచ్చిన ఆనందంలో పార్టీ చేసుకుంటాడు. ఒకరోజు అవినాష్ వాళ్ళ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ తన కార్ ని అవినాష్ కి ఇచ్చి ఇంటికి వెళ్ళమంటాడు. దారిలో అతడి కార్ ని కొందరు దుండగులు ధ్వంసం చేసి, అవినాష్ అతడి భార్యని కిడ్నాప్‌ చేస్తారు. అసలు వారిని కిడ్నాప్ చేసిందెవరు? సిధ్ , అవినాష్ ల మధ్య సంబంధం ఏంటో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

అవినాష్, దియాలని కిడ్నాప్ చేసి ఒక దగ్గర బంధించడంతో కథ ఆసక్తిగా మొదలవుతుంది. ఒక సిగరేట్ కంపెనీలో అవినాష్ జాయిన్ అవ్వడం, అందులో తన నైపుణ్యాన్ని ప్రదర్శించి సత్తా చాటుకొని గొప్ప పొజిషన్ కి రావడం.. అంతా ఒక ఇంటెన్స్ గా వెళ్తుంటుంది. అదే సమయంలో అతనికి కంపెనీలో కొన్ని నిజాలు తెలియడంతో కథ మరింత ఇంట్రెస్ట్ గా వెళ్తుంది. ‌అయితే కొన్ని సీన్లు ఎక్కడివో తీసుకొచ్చి ప్రస్తుతం జరుగుతున్న సీన్ల మధ్యలో ఇరికించడం వాటికి ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యాడని అనుకునేలోపే మరో కొత్త సీన్ రావడంతో కథనం అర్థం కాదు.

ప్రథమార్థంలో కొన్ని ట్విస్ట్ లతో ఓ మోస్తారుగా ఉంటుంది. ఇక ద్వితీయార్థంలో క్యారెక్టర్స్ చేసే నటనకి సీన్ కి సంబంధం లేకుండా స్క్రీన్ ప్లే వెళ్తుంటుంది. సిగరెట్ తాగకూడదని మెసెజ్ ఇవ్వడానికి ఇంత చేయాలా అనిపిస్తుంటుంది. ఈ మెసెజ్ ఇవ్వడానికి రెండు గంటల ఇరవై నిమిషాలు తీసుకోవడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ప్రేక్షకులని థ్రిల్ చేయడానికి థ్రిల్లర్ జానర్ అనే పేరుతో.. ఒక పేలవమైన డ్రామాని తీసాడు డైరెక్టర్ పవన్ కుమార్.

కిడ్నాప్ డ్రామని సరిగ్గా చూపించలేకపోగా, అటు సిగరేట్ కంపెనీ వెనుక దాగివున్న నిజాలని బయటపెట్టనీయకుండా.. ఏవో ఏవో లాజిక్ లేని సీన్స్ ద్వితీయార్థంలో చాలా ఉంటాయి. పోనీ క్లైమాక్స్ అయినా బాగుందా అంటే మరీ దారుణంగా ఉంది. ఎందుకు చూసాను రా అని ప్రేక్షకుడు అనుకునేలా ఈ ధూమమ్ ఉంది. అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. ఈ సినిమా చూడాలంటే ఓపిక కావాలి. పూర్ణచంద్ర తేజస్వి మ్యూజిక్ పర్వాలేదు. ప్రీత జయరామన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సురేశ్ ఆరుముగమ్ ఎడిటింగ్ తేలిపోయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

ఫహాద్ ఫాజిల్ నటన ఆకట్టుకుంది. అపర్ణ మురళి చక్కగా ఒదిగిపోయింది. ఇక వినీత్ నటన సినిమాకి ప్లస్. మిగిలిన వాళ్ళు వారి పాత్రల పరిధి మేర నటించారు.

తెలుగువన్ పర్ స్పెక్టివ్:

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలని ఇష్టపడేవారికే కాదు కామన్ ఆడియన్స్ కి కూడా థ్రిల్ ని ఇవ్వకపోగ.. అసంతృప్తికి గురిచేస్తుంది.

రేటింగ్: 2 / 5

✍🏻. దాసరి మల్లేశ్

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.